కిరణ్ అబ్బవరంకు “బన్నీ” సారీ, వైరల్ అవుతున్న ట్వీట్
పుష్ప 2 ట్రైలర్ ఏ ముహూర్తంలో రిలీజ్ చేసారో గాని పాన్ వరల్డ్ లెవెల్ లో వైరల్ అవుతోంది. యూట్యూబ్ లో భారీగా వ్యూస్ వస్తున్నాయి. పాట్నాలో గ్రాండ్ గా పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించగా రెండు లక్షల మంది హాజరు అయ్యారని టాక్.
పుష్ప 2 ట్రైలర్ ఏ ముహూర్తంలో రిలీజ్ చేసారో గాని పాన్ వరల్డ్ లెవెల్ లో వైరల్ అవుతోంది. యూట్యూబ్ లో భారీగా వ్యూస్ వస్తున్నాయి. పాట్నాలో గ్రాండ్ గా పుష్ప 2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించగా రెండు లక్షల మంది హాజరు అయ్యారని టాక్. ఇక ట్రైలర్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా ప్రముఖులు కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ట్రైలర్ లో కొన్ని షాట్స్ ఫ్యాన్స్ కే కాకుండా నార్మల్ ఆడియన్స్ కు కూడా పూనకాలు తెప్పించిన మాట వాస్తవం.
డైలాగ్స్ కూడా ఓ రేంజ్ లో ఉన్నాయని ఆడియన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. పార్ట్ 1 కంటిన్యూషన్ ఈ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ కూడా ఊహించలేదు. 3 ఏళ్ళ నుంచి సినిమా కోసం ఏ రేంజ్ లో కష్టపడ్డారో ట్రైలర్ లో క్లియర్ గా కనపడింది. ఇక యాంటీ ఫ్యాన్స్ సినిమాను ఓ రేంజ్ లో టార్గెట్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఈవెంట్ లో బన్నీ యాటిట్యూడ్ చూపించాడు అంటూ యాంటీ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ట్రైలర్ లో కొన్ని సీన్స్ కాపీ చేసారనే కామెంట్స్ కూడా చేయడం మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు సినిమా ట్రైలర్ పై యువ హీరో కిరణ్ అబ్బవరం చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారుతోంది. వైల్డ్ ఫైర్ అంటూ… ఫైర్ ఎమోజీ పెట్టి.. సినిమా రిలీజ్ డేట్ డిసెంబర్ 5 పెట్టి పోస్ట్ చేసాడు. ఈ ట్వీట్ కు బన్నీ రిప్లై ఇచ్చాడు. థాంక్ యూ మై బ్రదర్ అంటూ లవ్ సింబల్ పోస్ట్ చేసాడు. అలాగే క సినిమా సక్సెస్ కావడం పట్ల శుభాకాంక్షలు చెప్పాడు. సినిమా బిజీగా ఉండటం వల్లన చూడలేకపోయాను అంటూ బన్నీ రిప్లై ఇచ్చాడు. సినిమా కచ్చితంగా చూస్తాను… చూసి ఫోన్ చేస్తాను అంటూ కిరణ్ అబ్బవరం ట్వీట్ కింద రెస్పాండ్ అయ్యాడు.
బన్నీ రేంజ్ కు… కిరణ్ అబ్బవరం రేంజ్ కు అసలు ఏ మాత్రం సంబంధం లేదు. అయినా సరే కిరణ్ కు బన్నీ సారీ చెప్పడం చూసి ఫ్యాన్స్ మాత్రమే కాదు… వేరే హీరోల అభిమానులు కూడా బన్నీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. యాటిట్యూడ్ ఏ మాత్రం చూపించలేదు అని… పాన్ ఇండియా హీరో అయినా సరే తోటి నటుడ్ని గౌరవించాడు అంటూ పోస్ట్ చేస్తున్నారు. కచ్చితంగా పుష్ప సూపర్ హిట్ అని… నెగటివ్ టాక్ మొత్తం పోయి సినిమా సూపర్ హిట్ కావడం ఖాయం అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు.