Pushpa The Rule : పుష్ప 2లో పాటలు.. శ్రీవల్లికి మించి
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ పుష్ప ది రూల్. పుష్ప ది రైజింగ్ కి సీక్వెన్స్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. మొదటి భాగం ప్రభావంతో రెండో భాగంపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. “పుష్ప ది రైజ్”లో ఉత్తమ నటనకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. దీంతో అంచనాలు మరింత పెరిగాయి. మూవీ గురించి ఓ అప్ డేట్ బయటకు వచ్చింది.

Allu Arjun starrer movie Pushpa The Rule directed by Sukumar this time Pushpa 2 songs.. More than Srivalli
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ పుష్ప ది రూల్. పుష్ప ది రైజింగ్ కి సీక్వెన్స్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. మొదటి భాగం ప్రభావంతో రెండో భాగంపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. “పుష్ప ది రైజ్”లో ఉత్తమ నటనకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. దీంతో అంచనాలు మరింత పెరిగాయి. మూవీ గురించి ఓ అప్ డేట్ బయటకు వచ్చింది.
NTR31లో విలన్ గా అమితాబచ్చన్.. గూస్ బంప్స్ అప్డేట్..
పుష్ప పార్ట్1 లో సాంగ్స్ ఎంత బాగా క్లిక్ అయ్యాయో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్ స్టెప్ అందరినీ ఆకట్టుకుంది. ఆ సాంగ్ ను ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసాడు. ఇప్పుడు పార్ట్ 2 లో కూడా మళ్ళీ జానీ మాస్టర్ భాగం అయినట్టు తాజా పోస్ట్ తో కన్ఫర్మ్ చేసాడు. రీసెంట్ గా జానీ మాస్టర్ సుకుమార్ ను కలువగా దీనిపై పోస్ట్ చేస్తూ తమ సాంగ్ కోసం కూడా వెయిట్ చెయ్యండి అంటూ చెప్పడంతో ఈ విషయం కన్ఫర్మ్ అయ్యింది. దీన్ని బట్టి పార్ట్ 2 లో కూడా జానీ మాస్టర్ అల్లు అర్జున్ తో అదిరిపోయే స్టెప్స్ వేయిస్తారని అర్థమౌతోంది. మరి, అవి ఏ మేర ఆకట్టుకుంటాయో చూడాలి.
సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. మైత్రి మూవీ మేకర్స్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర చేసినా, అదరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఫహద్ ఫాసిల్.. రెండో భాగంలో మెయిన్ విలన్ రోల్ ఉంటుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఫస్ట్ పార్ట్‌లో అన్ని పాటలు హిట్ చేసిన ఆయన.. రెండో భాగంలో ఇంకెంత అదర కొడతారో చూడాలి. సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.