అల్లు అర్జున్ మెగా”పగ”..? గేమ్ ఛేంజ్ మీద బాంబ్..?
పుష్ప2 సంధ్యా థియేటర్ ఎపిసోడ్ ఆల్ మోస్ట్ ముగిసిపోయినట్టే అనంటున్నారు. శ్రీతేజ్ కోలుకుంటుండటంతో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేలా ఉన్నాయంటున్నారు. ఇలాంటి టైంలో మెగా పగకి పని చెప్పాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..
పుష్ప2 సంధ్యా థియేటర్ ఎపిసోడ్ ఆల్ మోస్ట్ ముగిసిపోయినట్టే అనంటున్నారు. శ్రీతేజ్ కోలుకుంటుండటంతో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేలా ఉన్నాయంటున్నారు. ఇలాంటి టైంలో మెగా పగకి పని చెప్పాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇది సడన్ గా బన్నీ మీద సోషల్ మీడియాలో పెరిగిన కామెంట్… సడన్ గా ఈ కామెంట్స్ రేయిజ్ అవటానికి రీజన్, పుష్ప 2 లో డిలీట్ చేసిన 20 నిమిషాల ఫుటేజ్ ని ఇప్పుడు యాడ్ చేయటం.. వాళ్ల సినిమా, వాళ్లిష్టం…ఇంకొత ఫుటేజ్ యాడ్ చేసి, పుష్ప2 ని రీరిలీజ్ చేస్తారు… దాంట్లో మెగా పగేంటనే డౌట్ ఎవరికైనా వస్తుంది.. కాని అక్కడే మెగా మతలబుంది. ఎగ్జాక్ట్ గా గేమ్ ఛేంజర్ రిలీజ్ అయిన మరుసటి రోజే పుష్ప 2 తాలూకు కొత్త ఫుటేజ్ రిలీజ్ కాబోతోంది. అంటే గేమ్ ఛేంజర్ కి ఎక్కువ థియేటర్స్ దొరక్కుండా చేసేందుకే ఈ పని చేస్తున్నారా? ఒకవైపు పుష్ప2 ఆడే థియేటర్స్ ని ఇవ్వకుండా, మరో వైపు గేమ్ ఛేంజర్ కి పుష్ప2 కూడా పోటీ ఇవ్వాలంటే, ఇలాంటిదేదో చేయాలి… ఇదేనా బన్నీ స్కెచ్…? ఇది ప్రశ్న రూపంలో ఎదురౌతున్న సోషల్ మీడియా డౌట్… మెగా హీరోలు ఒక్కొక్కరిగా సంధ్యా థియేటర్ మీద సానుబూతి చూపించినా, మెగా పగ మాత్రం అలానే ఉందా.. అందుకే అల్లు అర్జున్ గిల్లుతున్నాడా?
జనవరి 11 న పుష్ప2 మూవీలోంచి తీసేసి 20నిమిషాల ఫుటేజ్ యాడ్ కాబోతోంది. పుష్ప2 ఆడే థియేటర్స్ అన్నీంట్లో ఈ ఫుటేజ్ యాడ్ చేసి ఆడియన్స్ కి ట్రీట్ ఇస్తున్నామంది పుష్ప2 టీం. అంతవరకు బానే ఉంది. కాని ఇప్పుడే ఎందుకు? ఇదే మెగా వార్ మీద ఫైర్ అయ్యే బ్యాచ్ డౌట్.
ఆల్రెడీ అల్లు ఫ్యామిలీకీ,మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న గ్యాప్ మీద జనాలకు క్లారిటీ ఉంది.దానివల్లే పుష్ప2 రిలీజ్ టైంలోనే కాదు, వసూళ్ల విషయంలోకూడా మెగా హీరోల నుంచి రెస్పాన్సే లేదు. అలాంటి టైంలో సంద్యా థియేటర్ లో తొక్కిసలాట, తర్వాత మహిళ మరణించటం, దానివల్ల ఐదున్న అడుగుల అతిగాడంటూ జనాలు బన్నీని తిట్టుకోవటం… ఇంత డ్యామేజ్ జరిగింది
కట్ చేస్తే పుష్ప 2 జోరు తగ్గింది. త్వరలో ఓటీటీ రిలీజ్ కాబోతోంది. ఈనెలాఖర్లోనే పుష్ప2 ఓటీటీ స్ట్రీమింగ్ అన్నారు. కాబట్టి ఇంకా బన్నీ మీద పెద్దగా న్యూస్ ఉండకపోవచ్చు. హాస్పిటల్ లో శ్రీతేజ్ కోలుకుంటుండటంతో బన్నీ వివాదానికి ఆల్ మోస్ట్ ఫుల్ స్టాప్ పడే టైం వచ్చిందున్నారు
అలాంటి టైంలో మెగా పగకి పని చెప్పాడు బన్నీ అంటున్నారు. దానికి కారణం గేమ్ ఛేంజర్ రిలీజ్ అయ్యే టైంలో పుష్ప2 మూవీని థియేటర్స్ లోంచి తీసేయాలి… అదేం రూల్ కాకపోయినా, పుష్ప2 విడుదలైన 5 రోజునుంచే వసూళ్లు సౌత్ లో డ్రాప్ అయ్యాయి. కేవలం హిందీ వర్షన్ కే వసూళ్లొస్తున్నాయి. అవి కూడా అయిపోయాయనే మాటే వినిపిస్తోంది
పుష్ప వచ్చి నెల దాటింది, థియేటర్స్ లో గోల తగ్గింది. కాబట్టి పుష్ప2 ఆడే థియేటర్స్ అన్నీ గేమ్ ఛేంజర్ కి దక్కాలి. అలా దక్కకుండా ఉండేందుకు పుష్ప2 లో డిలీట్ చేసిన సీన్లను తిరిగి కలుపుతున్నమాంటూ అల్లు అర్జున్ స్కెచ్ వేశాడంటున్నారు.పుష్ప 2 కొత్త ఫుటేజ్ కోసం జనం వస్తారా రారా అటుంచితే, కొత్త ఫుటేజ్ యాడ్ అయ్యింది. కాబట్టి పుష్ప2 ఆడే థియేటర్స్ మరో పాన్ ఇండియా మూవీకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీనికి తోడు లక్కీగా కొత్త ఫుటేజ్ చూసేందుకు పుష్ప2 కోసం కొత్త టిక్కెట్లు తెగితే, అది గేమ్ ఛేంజర్ కి మైనెస్ అవుతుంది… ఇదే కారణం తో పుష్ప2 టీం గేమ్ చేంజర్ కి బొక్క పెట్టే ప్రయత్నం చేస్తోందన్న కామెంట్లు పెరిగాయి. బన్నీ మెగా పగని ఇలా తీర్చుకుంటున్నాడనే ట్రోలింగ్స్ మొదలయ్యాయి