ఏది ఏమైనా టాలీవుడ్ లో అల్లు అర్జున్ ది కాస్త డిఫరెంట్ బిహేవియర్. బాబు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి. లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ఇండియా వైడ్ గా సినిమాతో కంటే అరెస్టుతో బాగా ఫేమస్ అయ్యాడు అల్లు అర్జున్. ఆ తర్వాత పెట్టిన మీడియా సమావేశాలు, మాట్లాడిన మాటలు అన్నీ కూడా సెన్సేషనల్. ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై వెటకారంగా కామెంట్ చేయడం... ఆయన పేరు మర్చిపోవడం అన్నీ కూడా సెన్సేషన్ అయ్యాయి. పుష్ప సినిమా గ్రాండ్ సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్న అల్లు అర్జున్.. ఏం చేసినా చెల్లుతుందనే ఫీలింగ్ లో ఉన్నాడనే అభిప్రాయం కూడా టాలీవుడ్ వర్గాల్లో వచ్చేసింది. అరెస్టు తర్వాత అరెస్టుకు ముందు అల్లు అర్జున్ బిహేవియర్ చూసిన చాలామంది ఇది కరెక్ట్ కాదంటూ సోషల్ మీడియాలో కూడా కామెంట్ చేశారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ బయటకు రావాలి అనుకోవడం మాత్రం ఒక సెన్సేషన్. ఇక ఇప్పుడు మెగా హీరో సినిమాలు కూడా టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ మరో సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నాడు. ఒకవైపున సంక్రాంతి కానుకగా అంటే ఈ నెల 10న గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవుతున్న టైంలో పుష్ప పార్ట్ 2లో 20 నిమిషాలు యాడ్ చేస్తూ రీలోడేడ్ వెర్షన్ ఈ నెల 11 నుంచి దియేటర్లలో స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమాకు బాలకృష్ణ అలాగే వెంకటేష్ సినిమాల నుంచి థియేటర్ల కొరత ఉంది. ఇప్పుడు పుష్ప పార్ట్ 2 కోసం.. మళ్లీ థియేటర్లను కేటాయించాలి అనే డిమాండ్ కూడా వినపడుతోంది. ఈ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్లుగా మారిన మైత్రి మూవీ మేకర్స్.. వసూళ్లు పెంచుకోవడానికి సంక్రాంతి కానుకగా 20 నిమిషాల రీలోడెడ్ వెర్షన్ ను రిలీజ్ చేస్తుంది. దీనిపై ఇప్పుడు మెగా ఫ్యామిలీ మళ్ళీ సీరియస్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి. అల్లు అర్జున్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి కోపంగానే ఉన్నారు. ఇక తన కొడుకు సినిమాని ఇబ్బంది పెట్టడానికి మళ్లీ 20 నిమిషాలతో అల్లు అర్జున్ రెడీ అవ్వడం ఆయనను మరింత చిరాకు పెట్టే అవకాశం ఉండొచ్చు అనే ఒపీనియన్ కూడా వినపడుతోంది. పుష్ప మేకర్స్ ప్లానింగ్ చూస్తే ధియేటర్లను మళ్ళీ తమ వద్దనే ఉంచుకొని గేమ్ చేంజర్ సినిమాకు థియేటర్లను తగ్గించాలి అనే ప్లాన్ చేస్తున్నట్టుగానే అర్థమవుతుంది. ఇప్పటికే గేమ్ చేంజర్ సినిమాకు థియేటర్ల సంఖ్య బాగా తగ్గింది. దేవర పుష్ప సినిమాలకు ఉన్న ధియేటర్లు ఈ సినిమాకు లేవు అని చెప్పాలి. ఇది కచ్చితంగా కలెక్షన్స్ పై ప్రభావం చూపించే ఛాన్స్ కూడా ఉంది. దానికి తోడు తెలంగాణలో బెనిఫిట్ షోస్ లేవు అని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. కాబట్టి పుష్ప వేసిన స్టెప్పుతో గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది.[embed]https://www.youtube.com/watch?v=wuYpjdCrX6o[/embed]