Allu Arjun : త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్
ప్రస్తుతం పుష్ప2 (Pushpa 2) సినిమాతో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun). ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత.. ఇప్పటికే రెండు ప్రాజెక్ట్స్ లాక్ చేసుకున్నాడు బన్నీ. అర్జున్ రెడ్డి (Arjun Reddy) డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) తో గతంలోనే ఓ సినిమా అనౌన్స్ చేశాడు.

Allu Arjun targeted Trivikram
ప్రస్తుతం పుష్ప2 (Pushpa 2) సినిమాతో బిజీగా ఉన్నాడు ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun). ఆగష్టు 15న పుష్ప2 రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత.. ఇప్పటికే రెండు ప్రాజెక్ట్స్ లాక్ చేసుకున్నాడు బన్నీ. అర్జున్ రెడ్డి (Arjun Reddy) డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) తో గతంలోనే ఓ సినిమా అనౌన్స్ చేశాడు. అలాగే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) తో ఓ సినిమా ప్రకటించాడు. సందీప్ రెడ్డి ప్రాజెక్ట్ ప్రభాస్ ‘స్పిరిట్’ (Spirit) తర్వాత ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి.. నెక్స్ట్ త్రివిక్రమ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. కానీ ఈ మధ్యలో కోలీవుడ్ (Kollywood) దర్శకుడు అట్లీ లైన్లోకి వచ్చాడు.
దీంతో.. త్రివిక్రమ్ సినిమాకు బన్నీ డెడ్‌లైన్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను కేవలం 6 నెలల్లోనే పూర్తి చేయాలని అనుకుంటున్నాడట. పుష్ప2 రిలీజ్ అయ్యాక కాస్త గ్యాప్ ఇచ్చి.. అక్టోబర్ నాటికి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నాడట. అక్కడి నుంచి 2025 సమ్మర్ వరకు త్రివిక్రమ్ సినిమాలో తన పోర్షన్ షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడట.
ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కోసం త్రివిక్రమ్ ఎంత టైం తీసుకున్నా పర్లేదు అంటున్నాడట. ఇక త్రివిక్రమ్ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే.. అట్లీకి డేట్స్ ఇవ్వాలని భావిస్తున్నాడట అల్లు అర్జున్. అట్లీ ప్రాజెక్ట్ అయిపోగానే.. ఆ పై సందీప్ రెడ్డి సినిమా పై ఫోకస్ చేయనున్నాడు బన్నీ. ఈలోపు స్పిరిట్, అనిమల్ పార్క్ కంప్లీట్ చేసుకోనున్నాడు సందీప్ రెడ్డి. అయితే.. పుష్ప2 సినిమా కోసం ఇంత టైం తీసుకున్న బన్నీ.. అంత ఈజీగా త్రివిక్రమ్, అట్లీ సినిమాలు పూర్తి చేస్తాడని ఖచ్చితంగా చెప్పలేం. ఏదేమైనా.. నెక్స్ట్ మాత్రం బన్నీ తగ్గేదేలే అంటున్నాడు.