Allu Arjun: పుష్ప క్రేజ్.. బ‌న్నీ ఇన్‌స్టా ఫాలోవ‌ర్స్ సంఖ్య 25 మిలియ‌న్లు

త‌న ఇన్‌స్టా క‌వ‌ర్‌పేజ్‌పై 25 మిలియ‌న్స్ నెంబ‌ర్ వేసి.. థ్యాంక్యూ అని రాసుకొచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన ఆరున్నర ఏళ్లలోనే అల్లు అర్జున్ ఈ ఘనత అందుకోవడం విశేషం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 21, 2024 | 11:30 AMLast Updated on: Mar 21, 2024 | 11:30 AM

Allu Arjun Thanks To Fans As He Hits 25 Million Followers On Instagram

Allu Arjun: సోష‌ల్‌మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని రీతిలో ఈయనకు ఫాలోయర్స్ పెరిగిపోతున్నారు. ఇక‌.. పుష్ఫ పార్ట్ 1 సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ ఐకాన్ స్టార్ ఇప్పుడు మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

Chiranjeevi: మెగా రిస్క్.. బురదలో చిరంజీవి.. అందుకే మెగాస్టార్ అయ్యారు!

సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాంలో ఒక‌టి అయిన ఇన్ స్టాగ్రామ్ లో బ‌న్నీ ఫాలోవ‌ర్స్ సంఖ్య 25 మిలియ‌న్లకు చేరుకుంది. ఆ ఘ‌న‌త అందుకున్న తొలి సౌత్ ఇండియ‌న్ స్టార్‌గా రికార్డు సృష్టించాడు. దీంతో.. బ‌న్నీ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. దీనిపై బ‌న్నీ కూడా త‌న‌దైన స్టైల్‌లో స్పందిచాడు. త‌న ఇన్‌స్టా క‌వ‌ర్‌పేజ్‌పై 25 మిలియ‌న్స్ నెంబ‌ర్ వేసి.. థ్యాంక్యూ అని రాసుకొచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన ఆరున్నర ఏళ్లలోనే అల్లు అర్జున్ ఈ ఘనత అందుకోవడం విశేషం. 2017 నవంబర్‌లో అధికారికంగా ఇన్‌స్టాలోకి వచ్చారు. అప్పటి నుంచి క్రమం తప్పకుండా అభిమానులతో తన విషయాలను పంచుకుంటూనే ఉన్నాడు. సోషల్ మీడియాలో తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ తో పాటు త‌న ఫ్యామిలీతో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కూడా పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ను స‌ర్‌ప్రైజ్ చేస్తుంటాడు ఐకాన్ స్టార్.

అలా.. మెల్లమెల్లగా ఫాలోయర్స్‌ను పెంచుకుంటూ.. ఇప్పుడు ఏకంగా 25 మిలియన్ ఫాలోవ‌ర్స్‌ మైలురాయిని అందుకున్నాడు. 2022 జ‌న‌వ‌రిలో 15 మిలియన్ ఫాలోవ‌ర్స్‌ మైలురాయిని అందుకున్న అల్లు అర్జున్.. అప్పుడు కూడా ఆ ఘనత సాధించిన తొలి సౌత్ ఇండియన్ హీరోగా రికార్డు సృష్టించాడు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరిచిన నాలుగున్న‌ర‌ ఏళ్లలోనే ఈయన ఈ ఘనత అందుకున్నాడు. అప్పటి నుంచి కేవ‌లం రెండేళ్ల స‌మ‌యంలోనే 25 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్‌కు చేరుకుని.. అభిమానులు త‌న‌ను సౌత్‌కా సుల్తాన్ అని ఎందుకు పిలుస్తారో మ‌రోసారి ప్రూవ్ చేశాడు. సౌత్ ఇండియాలో ఇప్పటికే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగాడు. పుష్ప: ద‌ఇ రైజ్ అన్ని ఇండస్ట్రీల్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక‌.. త్వర‌లో విడుద‌ల కానున్న పుష్ప2 తో బ‌న్నీ క్రేజ్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోవ‌డం ఖాయ‌మ‌న్న విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి.