Allu Arjun: మరో రికార్డ్ సొంతం చేసుకున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్
లండన్‌లోని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారట. విగ్రహం కోసం త్వరలోనే అల్లు అర్జున్ లండన్ వెళ్లి తన మెజర్‌మెంట్స్ ఇవ్వనున్నాడట.

Allu Arjun: బెస్ట్ హీరోగా నేషనల్ అవార్డ్ అందుకున్న ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మరో రికార్డ్ సొంతం చేసుకున్నాడు. పుష్ప సినిమాతో తన టాలెంట్‌ను ప్రంపచానికి పరిచయం చేసిన ఈ స్టార్ ఇప్పుడు మరో ఘనత సాధించాడు. లండన్‌లోని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారట. విగ్రహం కోసం త్వరలోనే అల్లు అర్జున్ లండన్ వెళ్లి తన మెజర్‌మెంట్స్ ఇవ్వనున్నాడట. దీని గురించి అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా రాకపోయినా బన్నీ ఫ్యాన్స్ మాత్రం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఇప్పటికే సౌత్ నుంచి కేవలం ప్రభాస్, మహేష్ బాబు విగ్రహాలు మాత్రమే ఈ మ్యూజియంలో ఉన్నాయి. బాహుబలి టైంలో ప్రభాస్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు పుష్ప సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్‌తో అల్లు అర్జున్ విగ్రహం కూడా ఈ మ్యూజియంలో చేరబోతోంది. ఇప్పటికే పుష్ప సినిమాతో వరల్డ్‌వైడ్‌గా అల్లు అర్జున్ ఫేమ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పుష్ప సీక్వెల్ కూడా ఫాస్ట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది. వచ్చే ఏడాది ఆగస్ట్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ యూనిట్ రీసెంట్‌గానే ఎనౌన్స్ చేశారు. పుష్ప మొదటి పార్ట్‌తో నార్త్‌ను షేక్ చేసిన బన్నీ సీక్వెల్ మూవీతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.