Allu Arjun: బన్నీ ప్లాన్‌ మామూలుగా లేదుగా.. ఇక సినిమాలన్నీ పాన్‌ ఇండియానే..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ చూపులు మొత్తం ఇప్పుడు పుష్ప-2 సినిమా మీదే ఉన్నాయి. పుష్ప ఫస్ట్‌ పార్ట్‌ సెన్సేషనల్‌ హిట్‌ అవ్వడంతో సెకండ్‌ పార్ట్‌ మీద ఓ రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ అయ్యింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 8, 2023 | 01:15 PMLast Updated on: May 08, 2023 | 1:15 PM

Allu Arjun Trivikram Combo Movie

దీంతో ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, పోస్టర్‌ ఓ రేంజ్‌లో వైరల్‌ అయ్యాయి. సౌత్‌ కంటే నార్త్‌లోనే ఎక్కువ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది పుష్ప సినిమా. దీంతో ఇటు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా అల్లు అర్జున్‌కు మంచి క్రేజ్‌ ఏర్పడింది. అయితే ఇప్పుడు బన్నీ చేయబోయే తరువాత ప్రాజెక్ట్‌ మీద అందరి ఫోకస్‌ ఉంది. పుష్ప సినిమా తరువాత అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ వంగతో ఓ సినిమా ప్లాన్‌ చేశాడు బన్నీ. కానీ ఈ సినిమా 2026లో సెట్స్‌కు వెళ్తుంది. ఈ గ్యాప్‌లో ఇంకో సినిమా చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడు అల్లు అర్జున్‌.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా ప్లాన్‌ చేసినా.. అది ఇప్పుడు వర్కౌట్‌ అయ్యేలా లేదు. ఎందుకంటే మహేష్‌ బాబుతో త్రివిక్రమ్‌ తీస్తున్న సినిమా ఇంకా లేట్‌ అయ్యే చాన్స్‌ ఉంది. దీంతో బాలీవుడ్‌ ఫేమస్‌ డైరెక్టర్‌ సంజయ్‌ లీలా బన్సాలీతో ఓ సినిమా ప్లాన్‌ చేస్తున్నాడట అల్లు అర్జున్‌. రీసెంట్‌గానే ఓ సారి ముంబై వెళ్లి మరీ సంజయ్‌ని కలిసి వచ్చారట. అప్పటి నుంచీ బన్నీ టీం సంజయ్‌ టీంతో టచ్‌లోనే ఉన్నారట. దీంతో పుష్ప తరువాత వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమా తీయబోతున్నారని టాక్‌ నడుస్తోంది. ఇది కూడా డైరెక్ట్‌గా బాలీవుడ్‌లోనే తీయబోతున్నట్టు సమాచారం. అయితే దీనిపై ప్రస్తుతం చర్చలు మాత్రమే జరుగుతున్నాయి. పుష్ప-2 కంప్లీట్‌ అయిన తరువాత ఈ ప్రాజెక్ట్‌ గురించి అధికారికంగా ఎనౌన్స్‌మెంట్‌ వచ్చే చాన్స్‌ ఉంది.