Pushpa2 : పుష్ప 2 ఆగష్టు 15న కష్టమే
పుష్ప (Pushpa) సినిమాతో స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ (Allu Arjun) ఐకాన్ స్టార్ (Icon Star) గా మారిపోయాడు. పుష్ప పార్ట్ 1 ఊహించిన విజయాన్ని ఇచ్చింది.

Allu Arjun, who was a stylish star with the movie Pushpa, became an icon star.
పుష్ప (Pushpa) సినిమాతో స్టైలిష్ స్టార్‌గా ఉన్న అల్లు అర్జున్ (Allu Arjun) ఐకాన్ స్టార్ (Icon Star) గా మారిపోయాడు. పుష్ప పార్ట్ 1 ఊహించిన విజయాన్ని ఇచ్చింది. అలాగే.. పాన్ ఇండియా స్టార్ (Pan India Star) అయిపోయాడు బన్నీ. దీంతో పార్ట్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. కానీ ఇప్పుడు సుకుమార్ (Sukumar) బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది.
పుష్ప సినిమాతో ఏకంగా బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ కొట్టేశాడు అల్లు అర్జున్. దీంతో.. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుకుమార్ కూడా చాలా జాగ్రత్తగా ఈ సినిమాను ఓ శిల్పాన్ని చెక్కుతున్నట్టుగా చెక్కుతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ కూడా బడ్జెట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవడం లేదు. అయితే.. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సింది.. కానీ వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్‌గా ఆగస్టు 15న రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్. అలాగే.. ఈసారి పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ లేదని పలుమార్లు క్లారిటీ ఇస్తు వచ్చారు. కానీ ఇప్పుడు పుష్పరాజ్ ఫ్యాన్స్‌కు షాక్ తప్పదనే టాక్ నడుస్తోంది. ఈ సినిమా ఆగష్టు 15న కూడా రిలీజ్ అవ్వడం కష్టమేనని అంటున్నారు.
చెప్పిన డేట్‌కి రిలీజ్ చేయాలని మేకర్స్ ఎంత ట్రై చేస్తున్నా.. సుకుమార్ మాత్రం కాంప్రమైజ్ అవడం లేదట. బన్నీ కూడా జూన్ రెండో వారానికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని డెడ్ లైన్ పెట్టుకున్నాడట. కానీ ఈ సినిమా షూటింగ్ మరో నెల రోజులు జరిగితే గానీ, కంప్లీట్ అవని పరిస్థితి ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అవుట్ పుట్ చూసిన సుకుమార్‌కు కొన్ని సీన్లు నచ్చలేదట. దీంతో.. ఆ సీన్స్ రీ డిజైన్ చేసి రీ షూట్ చేయడానికి రెడీ అవుతున్నాడట. దీంతో అనుకున్న సమయానికి పుష్పరాజ్ థియేటర్లోకి రావడం కష్టమేనే టాక్ నడుస్తోంది. లేటెస్ట్‌గా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. వచ్చే నెల చివరి వరకు పుష్ప2 కొనసాగే అవకాశం ఉందంటున్నారు. మరి సుకుమార్ ఏం చేస్తాడో చూడాలి