Allu Arjun: శ్రీలీలతో చిందేయనున్న అల్లు అర్జున్.. పుష్ప 2లో స్పెషల్ సాంగ్..?

పుష్ఫ-2 కోసం వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్‌ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో పుష్ప-2కు సంబంధించిన ఓ ఎనర్జిటిక్ అప్‌డేట్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీని అందించి విపరీతంగా వైరల్ అవుతోంది. నిజానికి పుష్ప సక్సెస్‌లో ఊ అంటావా మావా పాట పాత్ర కూడా ఎక్కువగానే ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 18, 2024 | 01:18 PMLast Updated on: Jan 18, 2024 | 1:19 PM

Allu Arjun Will Do A Special Song With Sreeleela In Pushpa 2 Movie

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప. డిసెంబర్ 2021లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్‌ఫుల్ చిత్రంగా నిలిచి పాన్-ఇండియా వైడ్‌లో సంచలనం సృష్టించింది. అల్లు అర్జున్ మ్యానరిజమ్స్, డైలాగ్స్, సినిమా పాటలకు వరల్డ్ వైడ్‌గా విపరీతంగా ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాకు గాను అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు కూడా వరించింది.

Raviteja: మంచే జరిగింది.. రవితేజ భలే తప్పించుకున్నాడు..

దీంతో.. పుష్ఫ-2 కోసం వరల్డ్ వైడ్‌గా ఫ్యాన్స్‌ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో పుష్ప-2కు సంబంధించిన ఓ ఎనర్జిటిక్ అప్‌డేట్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీని అందించి విపరీతంగా వైరల్ అవుతోంది. నిజానికి పుష్ప సక్సెస్‌లో ఊ అంటావా మావా పాట పాత్ర కూడా ఎక్కువగానే ఉంది. సమంత తన గ్లామర్‌తో పాటు డ్యాన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పుష్ఫ-2 లో కూడా ఈ మ్యాజిక్‌ని రిపీటి్ చేసేందుకు మేకర్స్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా మరోసారి ఐటెం సాంగ్ బ్లాస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ లో కనిపించేందుకు ఇప్పటికే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే.. డ్యాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల ఆ ఛాన్స్‌ను దక్కించుకున్నట్లు టాక్ నడుస్తోంది.

ఈ న్యూస్‌తో ఫ్యాన్స్‌ ఎగిరి గంతేస్తున్నారు. పుష్ప-2 స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల అన్న వార్త ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్ ఎనర్జీకి.. శ్రీలీల పెర్ఫార్మెన్స్ తోడైతే.. వెండి తెర చిరిగిపోవడం ఖాయమంటూ కామెంట్లు పెడుతున్నారు. శ్రీ లీల ఇప్పటికే ఆహా వీడియో యాడ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి పనిచేసింది. ఇప్పుడు స్పెషల్ సాంగ్‌లో బన్నీ పక్కన చిందులేస్తే ఆ ఎనర్జీయే వేరంటూ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. మరి ఈ అప్‌డేట్‌లో నిజానిజాలేంటో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే..