గేమ్ ఛేంజర్ రిలీజ్ టైంలో పుష్ప2 టీం, 20 నిమిషాలు ఫుటేజ్ ని యాడ్ చేయాలన్న ఐడియా మీద ఆల్రెడీ ట్రోలింగ్ జరుగుతోంది. ఇది మెగా పగని కామెంట్లు కూడా పేలాయి. ఇరవై నిమిషాల ఫుటేజ్ ని కొత్తగా కలిపి, 2 వేల కోట్లు నొక్కేద్దమనుకుంటున్నారా అన్న డౌట్లు పెరిగాయి. విచిత్రం ఏంటంటే 1800 కోట్లు రాబట్టిన పుష్ప2 అని పోస్టర్లు వదిలితేనే, పట్టించుకున్న దిక్కులేదు. ఎందుకంటే ఇది హిందీలో బాగా ఆడితే ఆడిందేమో, కాని తెలుగులో రిలీజైన మూడో రోజే వసూళ్లు డ్రాపయ్యాయి. తమిళ్, మలయాళంలో ఆల్ మోస్ట్ డిజాస్టర్ అని తేల్చారు. తెలుగు లో యావరేజ్, కన్నడలో బిలో యావరేజ్... హిందీ బెల్డ్ లో మాత్రం 800 కోట్ల వసూళ్లొచ్చాయని పోస్టర్లు వదిలారు.. అవి నిజమే అనుకున్నా, ఇప్పుడుపుష్పరాజ్ క్రేజ్ తగ్గాక, 20 నిమిషాల పుటేజ్ ని యాడ్ చేసి 200 కోట్ల లాగేయాలనుకుంటున్నారు.. అదే అతి భయంకరమైన కక్కుర్తంటూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఆల్రెడీ గేమ్ ఛేంజర్ మూవీకి బొక్క పెట్టాలనే ప్రయత్నలో భాగమే ఇదని కొందరు, కాదు దంగల్ రికార్డుని, బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేసే కక్కుర్తి ఇదని ఇంకొందరంటున్నారు.. ఈ ట్రోలింగ్స్ ఇప్పట్లో ఆగేలా లేవు... కామెంట్ల దాడులకు కూడా బ్రేకుల్లేవు... పుష్ప 2 మూవీలో డిలీజ్ చేసిన చాలా సీన్లు కలిపి 20నిమిషాల ఫుటేజ్ ని, శుక్రవారం నుంచి సినిమాలు కలపబోతున్నారు. పుష్ప2 ఆడే థియేటర్స్ లో అదనంగా మరో 20 నిమిషాల డిలీటెడ్ సీన్లు యాడ్ చేస్తే, నిజంగానే చూడాలన్న క్యూరియాసిటి కలగటం కామన్. కాని నిజంగా ఇప్పుడు పుష్ప2 క్రేజ్ ఇంకా నడుస్తోందా అంటే లేనే లేదు... వారం ఆగితే ఓటీటీలో సినిమా వచ్చే అవకాశం ఉందన్నప్పుడు, ఎవరైనా థియేటర్స్ కెళ్లి డబ్బు పెట్టి పుష్ప2 ని చూస్తారా? తెలుగులో అయితే ఈ మూవీ విడుదలైన మూడోరోజే వసూల్లు డ్రాపయ్యాయి. హిందీలో జనాలు తెగ ఎగబడి చూశారు కాని, సౌత్ లో పుష్ఫ 2 కి అంత సీన్ లేదు. అయినా సినిమారిలీజైన 30 రోజుల తర్వాత ఇప్పుడు డిలీటెడ్ సీన్లను కలిపి, పుష్ప2 ఆడే థియేటర్స్ లో కొత్తగా ఫుటేజ్ వేయటం వెనక కక్కుర్తే ఉందా? 1800 కోట్లు రాబట్టిన పుష్ప 2 మూవీ మరో 51కోట్లు రాబడితే, బాహుబలి2 తాలూకు 1850 కోట్ల రికార్డు బ్రేక్ అవుతుంది.. ఇక 202 కోట్లు రాబడితే, ఇండియా నెంబర్ వన్ మూవీ దంగల్ రికార్డు బ్రేక్ అవుతుంది. సో దాన్ని బ్రేక్ చేసేందుకు బలవంతంగా పుష్ప2 నిఇంకా థియేటర్స్ లో ఆడిస్తున్నారనే కామెంట్లున్నాయి. సౌత్ లో అయితే ఈమూవీ విడుదలైన రెండు వారాల తర్వాత థియేటర్స్ లో ఈగలు కొట్టుకోవాల్సి వచ్చిందన్నారు అలాంటిది ఇన్ని వారాల తర్వాత, పుష్ప2 కి అదనంగా 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేసి రెండు వేల కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాలనుకుంటున్నారా? అది జరిగే పనేనా? అలా జరిగినా అసలు పుష్ప2 రికార్డుకి వ్యాల్యూ ఉంటుందా? అసలే 1800 కోట్లు రాబట్టిన పుష్పరాజ్ అంటేనే ఎవరూ పట్టించుకోవట్లేదు. దీనికి తోడు మెగా పగతో చరణ్ మూవీ కి థియేటర్స్ దక్కకుండా, పుష్ప2 మూవీని బలవంతంగా ఇంకా ఆడించే ప్రయత్నం అంటున్నారు. అందుకే కొత్త ఫుటేజ్ ని యాడ్ చేయాలన్న నాటకం మొదలు పెట్టారనంటున్నారు. నిజమేదైనా, రికార్డులు బ్రేక్ చేయాలంటే, కలెక్షన్లు కిక్ ఇవ్వాలి.... బలవంతంగా సినిమాలు థియేటర్స్ లోఆడిస్తే, వచ్చేదేముండదు... వచ్చిన పేరు కూడా కొట్టుకుపోతుంది తప్ప.. ఇది సోషల్ మీడియాలో పుష్పరాజ్ కక్కుర్తి మీద పెరిగినా కామెంట్ల దాడి. [embed]https://www.youtube.com/watch?v=H5q1X0abB8A[/embed]