అల్లు అర్జున్ ఆల్‌టైమ్ రికార్డ్.. ప్రభాస్, ఎన్టీఆర్ కంటే ముందే..!

టాలీవుడ్‌లో చాలా మంది హీరోలున్నారు కానీ ఈ మధ్య అల్లు అర్జున్ మాత్రం ఎవరికీ అందనంత ఎత్తుకు చేరిపోతున్నాడు. మనోడి పీఆర్ అలా ఉంది మరి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2025 | 03:50 PMLast Updated on: Mar 26, 2025 | 3:50 PM

Allu Arjuns All Time Record Before Prabhas And Ntr

టాలీవుడ్‌లో చాలా మంది హీరోలున్నారు కానీ ఈ మధ్య అల్లు అర్జున్ మాత్రం ఎవరికీ అందనంత ఎత్తుకు చేరిపోతున్నాడు. మనోడి పీఆర్ అలా ఉంది మరి. ఏం చేసినా.. ఎక్కడికి వెళ్లినా.. చివరికి ఇంట్లో ఖాళీగా కూర్చున్నా కూడా ఎలా ట్రెండ్ అవ్వాలి అనే విషయంపై పిహెచ్‌డీ చేసాడు. అందుకే సినిమాలు చేసినా చేయకపోయినా ట్రెండ్ అవుతూనే ఉంటాడు. పైగా పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సినిమాల కంటే ఆయన రెమ్యునరేషన్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. కేవలం మన దగ్గరే కాదు.. నేషనల్ మీడియా సైతం బన్నీ పారితోషికంపై స్పెషల్ ఫోకస్ చేస్తుందంటే సీన్ ఏంటో అర్థమైపోతుంది. అట్లీ సినిమా కోసం అల్లు వారబ్బాయి తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి తెలిస్తే షాక్ మీద షాక్ తగులుతుంది.

ఇండియన్ సినిమాలోనే ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు బన్నీ. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ మార్కెట్ ఎలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు 1800 కోట్ల థియెట్రికల్ రన్ వచ్చింది. ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కొట్టిన హీరో.. నెక్ట్స్ సినిమా కోసం తీసుకునే రెమ్యునరేషన్ గురించి వద్దన్నా చర్చ జరుగుతుంది కదా..! బన్నీ విషయంలోనూ ఇదే జరుగుతుందిప్పుడు. అట్లీ సినిమా కోసం ఈయన రికార్డ్ పారితోషికం అందుకోబోతున్నారు. అట్లీ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ వేగంగా జరుగుతున్నాయి. దుబాయ్‌లోనే కొన్ని రోజులుగా ఉండి కథ సిద్ధం చేస్తున్నారు అట్లీ. ఆయనతో పాటు అల్లు అర్జున్ కూడా అక్కడే ఉన్నారు. తాజాగా దుబాయ్‌లోని హిందూ టెంపుల్ కూడా దర్శించుకున్నారు బన్నీ. ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్, అట్లీ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించనున్నారు. ఈ సినిమా కోసం 400 కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు.. కేవలం బన్నీకే 175 కోట్ల పారితోషికంతో పాటు 15 పర్సెంట్ ప్రాఫిట్ షేరింగ్ కూడా ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ లెక్కన సినిమా బిజినెస్ 500 కోట్లకు పైగానే జరిగినా కూడా మళ్లీ బన్నీ ఖాతాలోకి 300 కోట్ల వరకు వచ్చినట్లే. అలాగే అట్లీ కూడా ఈ సినిమా కోసం భారీగానే రెమ్యునరేషన్ అందుకోబోతున్నారు. పుష్ప 2 కోసం అల్లు అర్జున్ 300 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు ఫోర్బ్స్ ఇండియా తెలిపింది. తాజాగా అట్లీ సినిమాకు రికార్డ్ పారితోషికం అందుకోబోతున్నారు. ఈ సినిమాను తక్కువ వర్కింగ్ డేస్‌లో పూర్తి చేయనున్నారు అట్లీ. అలా చేస్తే క్యాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. అది కూడా సినిమాకే లాభం. హీరో, దర్శకుడి రెమ్యునరేషన్ పక్కనబెడితే అట్లీ, అల్లు అర్జున్ సినిమా బడ్జెట్ 200 కోట్ల లోపే ఉంటుందని తెలుస్తుంది. అన్నీ కుదిర్తే 2026 సమ్మర్‌లోనే ఈ సినిమా విడుదల కానుంది. మొత్తానికి తన రెమ్యునరేషన్‌తో మరోసారి ట్రెండ్ అవుతున్నారు బన్నీ.