Allu Arjun: కలల ప్రాజెక్ట్ పక్కనపెట్టిన బన్నీ.. ఆదిపురుష్ మూవీనే కారణమా..?
అశ్వథ్థామ కథతో సినిమా రాబోతోందని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. ది ఇమ్మోర్టల్ అశ్వథ్థామ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ఆదిపురుష్‌లాగా వీఎఫ్‌ఎక్స్ బేస్డ్ మూవీ ఇది. ఐతే అశ్వథ్థామ పాత్ర ఎవరు చేస్తారన్న దానిపై రకరకాల చర్చ జరిగింది. ఈ సినిమాతోనే బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారనే టాక్ కూడా వినిపించింది.
Allu Arjun: మహాభారతం తెలిసిన ప్రతీ ఒక్కరికి అశ్వథ్థాముడి కథ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ద్రోణుడికి ప్రియశిష్యుడు కావడం.. ద్రోణుడి కోసం పాండవుల మీద పగ పెంచుకోవడం.. ఆ తర్వాత శ్రీకృష్ణుడి శాపానికి గురి కావడం.. కథగా రాస్తే ఫుల్ ఎమోషన్స్ ఉంటాయ్ ఈ పాత్ర చుట్టూ! సప్త చిరంజీవుల్లో ఈయన ఒకడు. అశ్వథ్థామ కథతో సినిమా రాబోతోందని చాలా ఏళ్లుగా ప్రచారం జరుగుతోంది. ది ఇమ్మోర్టల్ అశ్వథ్థామ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.
ఆదిపురుష్‌లాగా వీఎఫ్‌ఎక్స్ బేస్డ్ మూవీ ఇది. ఐతే అశ్వథ్థామ పాత్ర ఎవరు చేస్తారన్న దానిపై రకరకాల చర్చ జరిగింది. విక్కీ కౌషల్, రణవీర్ సింగ్ పేర్లు వినిపించాయ్. ఐతే ఈ సినిమాతోనే బన్నీ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారనే టాక్ కూడా వినిపించింది. పుష్ప 2 తర్వాత ఈ మూవీనే బన్నీ చేయబోతున్నాడనే ప్రచారం సాగింది. తీరా చూస్తే త్రివిక్రమ్‌తో మూవీ కమిట్ అయ్యాడు బన్నీ. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్, బన్నీ కాంబోలో నాలుగో సినిమా స్టార్ట్ కాబోతోంది. అశ్వథ్థామ మూవీపై బన్నీ ఇప్పుడు మరో ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిపురుష్ ఎఫెక్ట్‌తో బన్నీ ఆలోచనలో పడ్డాడనే టాక్ నడుస్తోంది. ఓం రౌత్ తెరకెక్కించిన ఆదిపురుష్ చిత్రం ప్రేక్షకులు, క్రిటిక్స్ నుంచి భారీ విమర్శలను అందుకుంది.
స్టార్ కాస్ట్, స్టోరీలైన్ సహా VFX పై తీవ్ర విమర్శలొచ్చాయి. సినిమాలో చాలా అంశాలతో అభిమానులు నిరాశ చెందారు. అశ్వథ్థామ కూడా అలాంటి మూవీనే కావడంతో.. సినిమా కాస్త అటు ఇటు అయితే ఇమేజ్‌కు భారీ డ్యామేజీ జరగడం ఖాయం అని బన్నీ టెన్షన్ పడుతున్నాడట. ప్రస్తుతానికి ఈ మూవీని పక్కనపెట్టాడని తెలుస్తోంది. అశ్వథ్థామ మూవీని ఆదిత్య ధర్ డైరెక్ట్ చేయబోతున్నాడు. మరి బన్నీ మనసు మార్చుకుంటారా..? లేదంటే కొత్త హీరోను వెతుక్కోవాలా అన్నది రాబోయే రోజుల్లో తేలాలి.