Allu Arjun: మామకు బన్నీ ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తాడా..?
నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గతంలో చాలాసార్లు చెప్పారు. ఇక అటు బీఆర్ఎస్‌లో టికెట్ హడావుడి మొదలైంది. ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారు.
Allu Arjun: నల్గొండలో కొన్నిరోజులుగా హీరో అల్లు అర్జున్ కటౌట్‌లు విపరీతంగా కనిపిస్తున్నాయి. కంచర్ల కన్వెన్షన్ ప్లేస్ ఓపెన్ చేయడానికి బన్నీ వస్తున్నాడని తెగ ప్రచారం చేశారు. ఆ కన్వెన్షన్ హాల్ కట్టింది.. అల్లు అర్జున్‌కి స్వయానా మామ అయిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. ఆయన బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తి. అయితే ఈసారి బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారిలో ఆయన కూడా ఉన్నారని, అందుకే తన బలం చూపించుకోవడానికే ఈ కన్వెన్షన్ హాల్ కట్టి, దానికి తన అల్లుడు అల్లు అర్జున్‌ని పిలిచి ఓపెన్ చేయించారనే టాక్ నడుస్తోంది.
నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి గతంలో చాలాసార్లు చెప్పారు. ఇక అటు బీఆర్ఎస్‌లో టికెట్ హడావుడి మొదలైంది. ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారు. సర్వే రిపోర్టులు, పార్టీ పెద్దల సూచనలు ఇప్పటికే తీసేసుకున్నారు కేసీఆర్. రేపోమాపో జాబితా ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఇలాంటి సమయంలో బన్నీ మామ.. తన బలం చూపించే ప్రయత్నం చేయడం కొత్త ఆసక్తి రేపుతోంది. ఇక అటు బన్నీ కూడా డైరక్ట్ రాజకీయాల జోలికి వెళ్లడం లేదు కానీ.. పరోక్షంగా తన మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డికి సీటు దక్కేలా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసమే నాగార్జునసాగర్‌లో మామ నిర్మించిన ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి వచ్చాడు. ఓపెనింగ్‌కు వచ్చిన బన్నీ.. రాజకీయంగా ఏమీ మాట్లాడలేదు. ఐతే పరోక్షంగా కంచర్ల మాత్రం.. తన అల్లుడుని తీసుకొచ్చి బలం నిరూపించుకుని సీటు దక్కించుకోవడానికి చూస్తున్నారని తెలిసింది. కేసిఆర్ అభ్యర్ధుల ఎంపికలో బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలో వ్యతిరేకత ఉన్న కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలని పక్కన పెట్టాలని చూస్తున్నారు. నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కు ఈ సారి సీటు ఇచ్చే విషయంలో క్లారిటీ లేదు. ఇదే సమయంలో ఇక్కడ ఎమ్మెల్సీ కోటిరెడ్డి సైతం బీఆర్ఎస్ సీటు ఆశిస్తున్నారు. ఇప్పుడు బన్నీ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి రేసులోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసిన కంచర్ల 21 వేల ఓట్లు తెచ్చుకుని నాలుగో స్థానంలో నిలిచారు. ఇప్పుడు తన సొంత ప్లేస్.. నాగార్జునసాగర్ సీటు ఆశిస్తున్నారు. మరి కేసిఆర్.. బన్నీ మామకు సీటు ఇస్తారా..? లేదా..? చూడాలి.