ALLU ARJUN: తెలంగాణ యాస‌లో బ‌న్నీ.. త్రివిక్ర‌మ్ కొత్త లెక్క

అల్లు అర్జున్‌తో మ‌రొక బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాల‌న్న క‌సితో ఉన్న త్రివిక్ర‌మ్.. త‌మ కాంబోలో రాబోతున్న నాలుగో మూవీపై నెక్స్ట్ లెవల్ ప్లానింగ్ చేస్తున్నాడని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. కాగా.. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పిస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 27, 2024 | 01:32 PMLast Updated on: Feb 27, 2024 | 6:25 PM

Allu Arjuns Film With Trivikram To Go On Floors In 2025 Allu Arjun Dialogues In Telangana Slang

ALLU ARJUN: టాలీవుడ్‌లో ఉన్న క్రేజీ కాంబినేషన్స్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్- అల్లు అర్జున్ కాంబో ఒకటి. వీళ్లిద్ద‌రి ఖాతాలో ఇప్ప‌టికే హ్యాట్రిక్ హిట్లు ప‌డ‌గా.. త్వ‌ర‌లో రాబోతున్న నాలుగో మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. గుంటూరు కారం లాంటి మోస్ట్ డిజ‌ప్పాయింట్ మూవీ త‌ర్వాత రాబోతున్న త్రివిక్ర‌మ్ చేస్తున్న మూవీ ఇదే. ఇక అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప-2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Devara: దేవర సిద్ధం.. క్లైమాక్స్ షూట్‌కు భైరా వచ్చేస్తున్నాడు..!

అయితే.. అల్లు అర్జున్‌తో మ‌రొక బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టాల‌న్న క‌సితో ఉన్న త్రివిక్ర‌మ్.. త‌మ కాంబోలో రాబోతున్న నాలుగో మూవీపై నెక్స్ట్ లెవల్ ప్లానింగ్ చేస్తున్నాడని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. కాగా.. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫ్యాన్స్‌కు పూన‌కాలు తెప్పిస్తోంది. త్రివిక్రమ్ సినిమా కోసం తెలంగాణ మాండలికంలో బన్నీ డైలాగ్స్ చెప్పబోతున్నాడన్న న్యూస్ ఇప్పుడు టాలీవుడ్‌లో వైర‌ల్‌గా మారింది.. క్యారెక్ట‌ర్‌కు త‌గ్గ‌ట్లుగా డైలాగులు ప‌ల‌క‌డంలో బ‌న్నీ దిట్ట అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. గతంలో రుద్రమదేవి సినిమాలో బన్నీ తెలంగాణ మాండలికంలో అద్భుతంగా డైలాగ్స్ చెప్పాడు. రీసెంట్‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిన పుష్ప‌మూవీలో.. రాయలసీమ మాండలికంలో డైలాగులు ఇర‌గ‌దీశాడు. ఇప్పుడు మ‌ళ్లీ త్రివిక్రమ్ సినిమా కోసం మరోసారి తెలంగాణ మాండలికంలో డైలాగ్స్ పలకబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో.. మొత్తానికి తమ నాలుగో చిత్రాన్ని త్రివిక్రమ్ – బన్నీ చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారంటూ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో తెగ సంద‌డి చేస్తున్నారు.

300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ఈ మూవీని ఈ ఏడాది దసరాకి అధికారికంగా స్టార్ట్ చేసి.. షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది. ఇంతకు ముందు వీరి కలయికలో వచ్చిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి, అల వైకుంఠపురం చిత్రాలు విజయంతమైన చిత్రాలుగా ప్రేక్షకుల ఆదరణ పొందాయి. దీంతో.. బ‌న్నీతో త‌న‌ నాలుగో చిత్రంపై త్రివిక్ర‌మ్ ఫుల్ ఫోకస్ పెట్టాడ‌ట‌. బన్నీ క్యారెక్టర్‌లో సాలిడ్ వేరియేషన్స్ ఉంటాయని.. అందుకే, మొత్తం సినిమాలో బన్నీ క్యారెక్టరే మెయిన్ హైలైట్‌గా ఉంటుందని తెలుస్తోంది. ఈ న్యూస్‌తో మరోసారి వీరిద్దరి కాంబోలో మరో భారీ హిట్ ఖాయమంటున్నారు ఫ్యాన్స్.