విషమంగా అల్లు అర్జున్ నాన్నమ్మ ఆరోగ్యం.. రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు రద్దు..?
అల్లు, మెగా కుటుంబాలలో గంభీరమైన వాతావరణం నెలకొందిప్పుడు. దానికి కారణం ఆ కుటుంబ పెద్ద ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నానమ్మ, రామ్ చరణ్ అమ్మమ్మ, లెజెండరీ కమెడియన్ అల్లు రామలింగయ్య అర్ధాంగి అల్లు కనకరత్నం హాస్పిటల్

అల్లు, మెగా కుటుంబాలలో గంభీరమైన వాతావరణం నెలకొందిప్పుడు. దానికి కారణం ఆ కుటుంబ పెద్ద ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నానమ్మ, రామ్ చరణ్ అమ్మమ్మ, లెజెండరీ కమెడియన్ అల్లు రామలింగయ్య అర్ధాంగి అల్లు కనకరత్నం హాస్పిటల్ పాలవడమే. ఈమె ఒకరు ఉన్నారు అనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే కనకరత్నం ఎప్పుడూ బయటికి రాలేదు. ఇంత పెద్ద సినిమా కుటుంబంలో ఉండి కూడా ఒక్క సినిమా వేడుకలో కూడా ఎప్పుడు కనిపించలేదు అల్లు కనకరత్నం. మూడేళ్ల కింద తన భర్త అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలలో మాత్రం కనకరత్నం కనిపించారు. అప్పుడు కూడా వీల్ చైర్ లోనే వచ్చారు ఈమె. అల్లు రామలింగయ్య అర్ధాంగి, మా అమ్మగారు అంటూ అల్లు అరవింద్ అందరికీ కనకరత్నంను పరిచయం చేశారు. ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు మీడియా ముందు ఆమె కనిపించలేదు. తాజాగా కనకరత్నం గారి ఆరోగ్యం విషమించిందని.. ప్రస్తుతం హైదరాబాదులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆమెను వెంటిలేటర్ మీద పెట్టి చికిత్స అందిస్తున్నారని తెలుస్తోంది.
ఆస్పత్రి వివరాలు రహస్యంగా ఉంచారు అల్లు కుటుంబ సభ్యులు. ఆమె వయసు 95 సంవత్సరాలు. నాన్నకు ఆరోగ్యం బాగాలేదు అనే విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ హుటాహుటిన దుబాయ్ నుంచి ఇండియాకు బయలుదేరినట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఆయన అట్లీ సినిమా స్టోరీ సిట్టింగ్స్ కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడే ఉండి సినిమా స్టోరీ వింటున్నాడు బన్నీ. ఇప్పుడు నాన్నమ్మ హెల్త్ కండిషన్ తెలుసుకుని వెంటనే ఇండియాకు రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. బన్నీ కూడా వెంటనే తిరుగు ప్రయాణం అయ్యాడు అంటే ఆమె ఆరోగ్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఆమె రామ్ చరణ్ కు అమ్మమ్మ అవుతుంది. అల్లు అరవింద్ సొంత చెల్లెలు సురేఖని చిరంజీవి పెళ్లి చేసుకున్నాడని అందరికీ తెలుసు. అలా అల్లు వారి ఇంటి అల్లుడయ్యాడు మెగాస్టార్.
ఇప్పుడు తన అత్తమ్మ ఆరోగ్యం బాగోలేదని తెలిసి ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడు చిరంజీవి. మరోవైపు అమ్మమ్మకు ఆరోగ్యం బాగోలేకపోతే.. మనవడు పుట్టినరోజు వేడుకలు చేసుకుంటాడా..? అందుకే మార్చి 27న చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది ఎలాంటి సంబరాలు లేకుండానే చరణ్ బర్త్డే జరగబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు కనకరత్నం గారి ఆరోగ్యం కాస్త విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. వయసు రీత్యా వచ్చిన సమస్యలతోనే ఆమె హాస్పిటల్ పాలయ్యారు. 95 సంవత్సరాలు కావడంతో వయోభారం కూడా ఆమెను బాగా ఇబ్బంది పెడుతుంది. వైద్యులు తమవంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కచ్చితంగా ఆమె మళ్ళీ తిరిగి ఆరోగ్యంతో ఇంటికి వస్తారు అని బలంగా నమ్ముతున్నారు అల్లు, మెగా కుటుంబ సభ్యులు. అదే జరగాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఎంతైనా ఇంట్లో ఒక పెద్ద దిక్కు ఉంటే ఆ ధైర్యం వేరు. అందుకే ఆ ధైర్యానికి ఏమి కాకూడదని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నారు అల్లు కుటుంబ సభ్యులు. కనక రత్నం గారు మళ్ళీ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆ దేవుడిని మనం కూడా ప్రార్థిద్దాం.