Allu Arjun: స్టార్‌ పని మనిషి.. అల్లు అర్జున్‌ పని మనిషి ఇన్‌స్టా ఫాలోయింగ్‌ చూశారా..?

ఈ అమ్మాయిని చూడండి. ఎవరో గుర్తు పట్టారా..? యస్‌.. స్టైల్‌లిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ వాళ్లింట్లో పనిమనిషి ఈమె. ఈ అమ్మాయి పేరు అశ్విని. బన్నీ ఫ్యాన్స్‌ అందరికీ అశ్విని తెలియకపోయినా.. అప్పుడప్పుడు బన్నీని ఇంటికి వెళ్లి కలిసేవాళ్లకు మాత్రం తెలిసే ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 16, 2024 | 06:04 PMLast Updated on: Jan 16, 2024 | 6:04 PM

Allu Arjuns Home Maid Ashwini Earning Huge Followers In Instagram

Allu Arjun: సెలబ్రిటీలు.. వాళ్ల పిల్లలే కాదు.. వాళ్లింట్లో పని మనుషులు కూడా అప్పుడప్పుడు ఫేమస్‌ అవుతుంటారు. అప్పుడు వాళ్లు నార్మల్‌ పనిమనుషులు కాదు. స్టార్‌ పనిమనుషులు. కావాలంటే ఈ అమ్మాయిని చూడండి. ఎవరో గుర్తు పట్టారా..? యస్‌.. స్టైల్‌లిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ వాళ్లింట్లో పనిమనిషి ఈమె. ఈ అమ్మాయి పేరు అశ్విని. బన్నీ ఫ్యాన్స్‌ అందరికీ అశ్విని తెలియకపోయినా.. అప్పుడప్పుడు బన్నీని ఇంటికి వెళ్లి కలిసేవాళ్లకు మాత్రం తెలిసే ఉంటుంది.

HANUMAN: హనుమాన్ సెంచరీ.. వంద కొట్టిన హనుమాన్‌..

బన్నీ వాళ్ల ఇంట్లో అల్లు అర్హ, అయాన్‌ను చూసుకుంటుంది ఈ అమ్మాయి. చాలా వీడియోల్లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంది. అప్పట్లో తనకు మంచి ఇన్‌స్టా ఫాలోవర్స్‌ రావాలంటూ ఈ అమ్మాయితో బన్నీ ఓ వీడియో కూడా చేశాడు. ఎంత మంది ఫాలోవర్స్‌ కావాలి నీకు అంటే.. 30 వేల ఫాలోవర్స్‌ కావాలంటూ ఈ వీడియో అమ్మాయి అడుగుతుంది. కానీ ఇప్పుడు ఈ అమ్మాయికి ఏకంగా లక్షా 33 వేల మంది ఫాలోవర్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చారు. దీంతో కొన్ని రోజుల్లోనే అశ్విని ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ఫేమస్‌ అయ్యింది. ఇంటర్నెట్‌లో ఫాలోవర్స్‌ కోసం వింత వింత రీల్స్‌ చేసేవాళ్లకు కూడా ఇంత మంది ఫాలోవర్స్‌ లేరు. నిజం చెప్పాలంటే చాలా మంది ఇన్‌ఫ్లూయెన్సర్లకు కూడా ఈ మాదిరి ఫాలోయింగ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో లేదు.

రీసెంట్‌‌గా మెగా ఫ్యామిలీ బెంగళూరులో సెలబ్రేట్‌ చేసుకున్న ఈవెంట్‌కు కూడా బన్నీ ఫ్యామిలీతో అశ్విని వెళ్లింది. అక్కడ అల్లు అరవింద్‌, శ్రీజలతో దగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో అశ్వినిని అంతా స్టార్‌ పనిమనిషి.. సెలబ్రిటీ పనిమనిషి అంటూ పొగిడేస్తున్నారు. ఏది ఏమైనా బన్నీ వీడియోతో ఇన్‌స్టాగ్రామ్‌ స్టార్‌గా మారిపోయింది అశ్విని.