కళ్యాణ్ మావయ్య థాంక్స్: తగ్గిన పుష్ప

పుష్ప సినిమా సక్సెస్ నేపధ్యంలో అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తమకు ఎంతో సపోర్ట్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి , మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డిగారికి ధన్యవాదాలు చెప్పాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 7, 2024 | 08:28 PMLast Updated on: Dec 07, 2024 | 8:28 PM

Allu Arjuns Interesting Comments On The Success Of Pushpa Movie

పుష్ప సినిమా సక్సెస్ నేపధ్యంలో అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తమకు ఎంతో సపోర్ట్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి , మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డిగారికి ధన్యవాదాలు చెప్పాడు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పాడు. ముఖ్యంగా కళ్యాణ్ బాబాయ్ మావయ్యకు థాంక్స్ అంటూ కామెంట్స్ చేసాడు.

అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ధన్యవాదాలు చెప్పాడు. నేను మూడేళ్ల తర్వాత సంధ్య థియేటర్ లో సినిమా చూడటానికి వెళ్లానన్న బన్నీ థియేటర్ బయట అభిమానుల ఒత్తిడి ఉండటం వల్ల నేను పూర్తి సినిమా చూడకుండానే వెళ్లిపోయానని తెలిపాడు. రేవతి చనిపోయారని తెలిశాక స్పందించడానికి నాకు సమయం పట్టిందన్నాడు. అందుకే కొంచెం ఆలస్యంగా స్పందించాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు. ఆ కుటుంబానికి అండగా ఉంటామన్నాడు.