PUSHPA 2: పుష్ప 2 వరుస సర్‌ప్రైజ్‌లు.. త్వరలో టీజర్.. ఆ వెంటనే పాటలు..

పుష్ప 1 మూవీ వచ్చినప్పుడు కేవలం పాటలు, అలాగే తగ్గేదిలేదనే డైలాగే ఈ సినిమాను ఊరిజనం వరకు తీసుకెళ్లాయి. సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా దక్కాల్సినంత ప్రమోషన్ దక్కింది. అలా కలిసొచ్చింది కాని, నిజానికి పుష్ప మూవీకి నార్త్‌లో కాని, తమిళ, మలయాళ మార్కెట్లలోకాని సరైన ప్రమోషన్ చేయలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 18, 2024 | 05:02 PMLast Updated on: Apr 18, 2024 | 5:02 PM

Allu Arjuns Pushpa 2 Teaser Coming Soon And Music Will Come Out Soon

PUSHPA 2: పుష్ప 2 మూవీ టీం వేగం పెంచింది. ఇంకా షూటింగ్ పెండింగ్ ఉన్నా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్నాకాని, సుకుమార్ ప్రమోషన్‌లో ఎమోషన్ పెంచేస్తున్నాడు. మొన్నే టీజర్ వదిలిన టీం.. ఇంతలోనే మరో టీజర్ రెడీ చేసింది. అదింకా రిలీజ్ చేయలేదు. అంతలోనే సాంగ్ లాంచింగ్‌కి కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పుష్ప 1 మూవీ వచ్చినప్పుడు కేవలం పాటలు, అలాగే తగ్గేదిలేదనే డైలాగే ఈ సినిమాను ఊరిజనం వరకు తీసుకెళ్లాయి.

Nithin-Naga Chaitanya: బాక్సాఫీస్ పోటీ.. నితిన్‌కు పోటీగా నాగ చైతన్య

సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా దక్కాల్సినంత ప్రమోషన్ దక్కింది. అలా కలిసొచ్చింది కాని, నిజానికి పుష్ప మూవీకి నార్త్‌లో కాని, తమిళ, మలయాళ మార్కెట్లలోకాని సరైన ప్రమోషన్ చేయలేదు. అయినా కంటెంట్ కత్తిలా ఉండటంతో కాసుల వర్షం కురిసింది. రూ.450 కోట్ల వరకు వసూళ్ల లెక్క తేలింది. అందుకే పుష్ప 1 విషయంలో జరిగిన మిస్టేక్ పుష్ప 2 విషయంలో జరగొద్దనే, ఈ సినిమా రిలీజ్‌కి మూడు నెలల ముందు నుంచే ప్రమోషన్ మొదలు పెట్టాడు. బన్నీ బర్త్ డేకి టీజర్ వదిలిన సుకుమార్, మే 1 కి రెండో టీజర్ రిలీజ్ చేయబోతున్నాడు. మే రెండో వారం పుష్ప 2 తాలూకు సాంగ్ లాంచ్ చేయబోతున్నారు.

ఇక ప్రతీ నెల రెండో వారం ఒక సాంగ్, నాలుగో వారం మరో సాంగ్ రిలీజ్ చేస్తూ ప్రమోషన్ స్పీడ్ పెంచే పని చేస్తున్నాడు సుకుమార్. అంతా అనుకున్నట్టు జరిగితే, పుష్ప 2 వెయ్యికోట్లేం ఖర్మ, అంతకుమించి రాబట్టే ఛాన్స్ ఉంది.