PUSHPA 2: చీర, బొట్టు, కాలికి గజ్జెలు.. గంగమ్మ జాతర పూనకాలు..
సుకుమార్‌తో, త్రివిక్రమ్‌తో బన్నీ మూడు సినిమాలు తీశాడు. కాని సుకుమార్‌తో బన్నీ కాంబినేషన్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే గొంగలిపురుగు, సీతాకోక చిలుక అయినట్టు, బన్నీలోని నటుడు, మహా గొప్ప నటుడిగా మారింది సుకుమార్ స్కూల్లోనే.
PUSHPA 2: పుష్ప రాజ్ రెండోసారి తగ్గేది లేదని చెప్పాడు. పట్టుచీర, నిమ్మకాయల దండ, పెద్ద బొట్టు, భయపెట్టేలా కాటుక, కాలి గజ్జెలు, కుంకుమ పరిచిన నేలమీద నడక, చివరికి అరుపులు, మధ్యలో ఫైట్లు.. అంతా గంగమ్మ జాతర పూనకాల ఎఫెక్ట్ అంటున్నారు. 50 కోట్లు ఖర్చు పెట్టి ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ తెరకెక్కించాడు సుకుమార్. పాట, ఫైట్ రెండు కలిపి తెరకెక్కించిన ఈ పాటతో లెక్కే మారిపోయేలా ఉంది. ఇక్కడే ఒక ఇంట్రస్టింగ్ అంశం ఎలివేట్ అయ్యింది.
DANAM NAGENDER: దానంకి మినిస్ట్రీ కావాలట ! సికింద్రాబాద్ టిక్కెట్టు ఎవరికో ?
సుకుమార్‌తో, త్రివిక్రమ్‌తో బన్నీ మూడు సినిమాలు తీశాడు. కాని సుకుమార్‌తో బన్నీ కాంబినేషన్ వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే గొంగలిపురుగు, సీతాకోక చిలుక అయినట్టు, బన్నీలోని నటుడు, మహా గొప్ప నటుడిగా మారింది సుకుమార్ స్కూల్లోనే. ఆర్య టైంలో నటుడిగా ఫస్ట్ ఫోకస్ అయ్యాడు. డాన్సర్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. హిట్ మెట్టెక్కాడు. కట్ చేస్తే కొన్నాళ్లకు ఆర్య 2 వచ్చింది. అందులో ఆఫ్రికన్ లుక్‌లో బన్నీ అవతారం ఫ్యాన్స్‌కి పిచ్చెక్కించింది. ఇక సైకో పాత్ లాంటి పాత్ర, బన్నీని నటుడిగా ఓరేంజ్ వెలిగేలా చేసింది. అచ్చంగా అలానే పుష్పతో స్టైలిష్ స్టార్.. ఐకాన్ స్టార్‌గా మారాడు. నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా రికార్డు క్రియేట్ చేశాడు. ఇప్పుడు ఏకంగా గంగమ్మ జాతర ఎఫెక్ట్ చూపించాడు.
మొన్న గొడ్డలి పట్టుకుని చైర్‌లో కూర్చున్న ఫోటో షాక్ ఇస్తే, ఇప్పుడు బన్నీ బర్త్ డే స్పెషల్ గా వచ్చిన టీజర్ వెన్నులో వనుకు తెస్తోంది. రెండేళ్లైనా పుష్పరాజ్ జోరు తగ్గలేదనేలా పుష్ప 2 టీజర్‌కి వస్తున్న రెస్పాన్స్‌తో తేలింది. విచిత్రం ఏంటంటే సౌత్ కంటే ఎక్కువ నార్త్ జనాలు ఈ టీజర్‌కి ఫిదా అయ్యారు. లెక్కల మాస్టార్ బన్నీని పుష్కరానికోసారి పెద్ద నిచ్చెనెక్కిస్తూ లెక్కే మారుస్తున్నాడు. పుష్ప 2 ది రూల్‌తో ఏకంగా బన్నీ వెయ్యికోట్ల స్టార్‌గా మారేలా ఉన్నాడు.