PUSHPA 2: పుష్ప 3 కోసం లెక్క మార్చేసిన డైరెక్టర్ సుకుమార్
పుష్పరాజ్.. ది రైజ్ తర్వాత పుష్పరాజ్ ది రూల్ అన్నారు. అదే పుష్ప 2 గా ఆగస్ట్ 15కి వచ్చేలా తెరకెక్కిస్తున్నారు. అయితే, ఇంకా ఆ సినిమా పూర్తి కాలేదు. అంతలోనే పుష్ప 3 ప్లానింగ్ జరిగిపోతోంది. ఇది సాధ్యమేనా?
PUSHPA 2: పుష్ప 2 ఆగస్ట్ 15 రిలీజ్ డేటే డౌట్‌లో పడింది. ఇది వాయిదా పడుతుందేమో అనే పుకార్ల మధ్య ఐకాన్ స్టార్ ఫ్యాన్స్‌కి కంగారు పెరిగేలా ఉంది. ఇలాంటి టైంలో కిక్ ఇచ్చే న్యూస్ రూమర్ అనేకంటే, నిజం అనేలా వచ్చేసింది. అదే పుష్ప మూడో సీక్వెల్ పుష్ప 3. పుష్పరాజ్.. ది రైజ్ తర్వాత పుష్పరాజ్ ది రూల్ అన్నారు. అదే పుష్ప 2 గా ఆగస్ట్ 15కి వచ్చేలా తెరకెక్కిస్తున్నారు. అయితే, ఇంకా ఆ సినిమా పూర్తి కాలేదు. అంతలోనే పుష్ప 3 ప్లానింగ్ జరిగిపోతోంది. ఇది సాధ్యమేనా?
MEGA MOVIES: మెగా జాతర.. 5 నెలలు.. 4 సినిమాలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
త్రిబుల్ ఆర్ 2, బాహుబలి 3 అంటూ రాజమౌళి ఊరించి, తన సినిమాలకు ప్రమోషన్ పెంచినట్టే సుకుమార్ అదే పనిచేస్తున్నాడా..? అసలు విషయం ఏంటంటే పుష్ప 2 క్లైమాక్స్‌లో రెండు వర్షన్స్ ప్లాన్ చేసిన సుకుమార్, రెండో వర్షన్‌నే ఫిక్స్ చేయటంతో అది నెవర్ ఎండింగ్‌లా అనిపించిందట. దీంతో పుష్ప 3 ఉంటుందనేలా పుష్ప 2 క్లైమాక్స్‌ని కూడా డిజైన్ చేశారట. అంటే ఇంకెప్పుడైనా పుష్ప 3 తీస్తారనుకోవచ్చు. కాని ఎప్పుడో కాదు.. ఇప్పుడే తీసేందుకు ప్లానింగ్ జరుగుతోంది. ముందుగా పుష్ప 2ని మూడో సీక్వెల్ ఉందనేలా క్లైమాక్స్ ప్లాన్ చేశారు.
కాని పుష్ప 3ని సీరియస్‌గా తీసుకోలేదు. కాని రీసెంట్ డెవలప్‌మెంట్స్‌లో పుష్ప 3కి మంచి పాయింట్ దొరకటమే కాదు, మంచి కథ కూడా రెడీ అయ్యిందట. దీంతో పుష్ప 3ని ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. త్రివిక్రమ్‌తో మూవీ సగం చేశాకే బన్నీ పుష్ప 3కి కూడా డేట్లు కేటాయిస్తాడట.