Pushpa 2 The Rule Teaser: పుష్ప ది రూల్.. బిగ్ అప్‌డేట్.. టీజర్ వచ్చేస్తోంది..!

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్ర టీజర్‌ విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 8న పుష్ప 2 టీజర్ రానున్నట్లు మూవీ టీం అనౌన్స్ చేసింది. పుష్ప మాస్ జాతర ప్రారంభం అంటూ అప్‌డేట్ ఇచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 2, 2024 | 07:24 PMLast Updated on: Apr 02, 2024 | 7:24 PM

Allu Arjuns Pushpa2 The Rule Teaser Out On April 8th On The Occasion On Bunny Birthday

Pushpa 2 The Rule Teaser: అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2: ద రూల్. పుష్ప సీక్వెల్‌గా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీగా రానున్న పుష్ప 2కు సంబంధించి మూవీ మేకర్స్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్ర టీజర్‌ విడుదల తేదీని ప్రకటించారు. ఏప్రిల్ 8న పుష్ప 2 టీజర్ రానున్నట్లు మూవీ టీం అనౌన్స్ చేసింది. పుష్ప మాస్ జాతర ప్రారంభం అంటూ అప్‌డేట్ ఇచ్చింది.

KALKI 2898 AD: రెబల్ స్టార్ ఫుల్ రిలాక్స్.. ఫ్యాన్స్‌కి నిరాశ తప్పదా..?

ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చే ఉద్దేశంతో టీజర్ డేట్ అనౌన్స్ చేసింది. దీనికి సంబంధించిన పోస్టర్‌లో బన్నీ కాళ్లకు గజ్జెలు కట్టి కనిపిస్తున్నాయి. దీంతో ఈ టీజర్ మాసీగా ఉండబోతుందని అర్థమవుతోంది. ప్రత్యేకంగా జాతర సీక్వెన్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించడం గ్యారెంటీ అని టాక్. ఈ చిత్రం వచ్చే ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ నిర్విరామంగా కొనసాగుతోంది. ఇప్పటికే కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మరో రెండు, మూడు నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తూనే, ప్రమోషన్ మొదలుపెడతారు. ఆగష్టులో కచ్చితంగా రిలీజ్ చేయాలనే పట్టుదలతో చిత్ర యూనిట్ పని చేస్తోంది.

రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతోపాటు ఇతర భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. మరి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర టీజర్.. అంచనాల్ని అందుకుంటుందా.. లేదా.. మరో వారంలో తేలనుంది.