Allu Arjun’s son Allu Ayan  : నువ్వు ఏదో కంత్రీలా ఉన్నావు బేటా..

సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీలు ఇంటర్నెట్‌లో ఎలా ట్రెండ్ అవుతూ ఉంటారో వాళ్ల పిల్లలు కూడా అలానే ట్రెండ్‌ అవుతూ ఉంటారు. చాలా మంది హీరోల భార్యలు తమ పిల్లల ఫొటోలు, వీడియోలో ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేస్తూ.. చిన్నప్పటి నుంచే వాళ్లను ఫ్యాన్స్‌కు దగ్గర చేస్తుంటారు. ఇలాగే అల్లు అర్జున్‌ కూడా తన పిల్లల వీడియోలు రెగ్యులర్‌గా ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేస్తూ ఉంటాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 15, 2024 | 06:20 PMLast Updated on: Jan 15, 2024 | 6:20 PM

Allu Arjuns Son Allu Ayan Is Going Viral On The Internet

సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీలు ఇంటర్నెట్‌లో ఎలా ట్రెండ్ అవుతూ ఉంటారో వాళ్ల పిల్లలు కూడా అలానే ట్రెండ్‌ అవుతూ ఉంటారు. చాలా మంది హీరోల భార్యలు తమ పిల్లల ఫొటోలు, వీడియోలో ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేస్తూ.. చిన్నప్పటి నుంచే వాళ్లను ఫ్యాన్స్‌కు దగ్గర చేస్తుంటారు. ఇలాగే అల్లు అర్జున్‌ కూడా తన పిల్లల వీడియోలు రెగ్యులర్‌గా ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేస్తూ ఉంటాడు. నిజానికి ఎక్కువగా అల్లు అర్హతో వీడియోస్‌ చేస్తుంటాడు అల్లు అర్జున్‌. కానీ ఇంటర్నెట్‌లో మాత్రం తన కొడుకు అల్లు అయాన్‌ ట్రెండింగ్‌లో ఉంటాడు. ఎందుకంటే అయాన్‌ వేసే వేశాలు అలా ఉంటాయి. చూడ్డానికి నాలుగు అడుగులు కూడా లేకున్నా.. కోతి చేష్టలకు కేరాఫ్‌ అడ్రస్‌ అల్లు అయాన్‌. ప్లేస్‌ ఏదైనా కావొచ్చు.. సిచ్యువేషన్‌ ఎలా ఐనా ఉండొచ్చు కానీ అల్లు అయాన్‌ యాటిట్యూడ్‌ మాత్రం మారదు. అంతా ఒకలా బిహేవ్‌ చేస్తు అయాన్‌ మాత్రం ఇంకోలా ఉంటాడు. ఎంత పద్దతిగా ఉన్న సిచ్యువేషన్‌ ఐనా నిమిషంలో ఫన్నీగా మార్చేస్తాడు.

ఇక ఫొటోలకు అయాన్‌ ఇచ్చే పోజుల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. బుడ్డోడి గెస్చర్స్‌ మామూలుగా ఉండవు. ఇన్‌స్టాగ్రామ్‌లో మోడల్స్‌ అని చెప్పుకునే రీల్స్‌ బ్యాచ్‌ ఎలాంటి గెస్చర్స్‌ ఇస్తారా అలాంటి గెస్చర్సే ఇస్తాడు అయాన్‌. దీంతో ఎక్కడలేని మీమ్స్‌ వస్తుంటాయి అల్లు అయాన్‌ మీద. రామ్‌చరణ్‌కి కూతురు పుట్టినప్పుడు అల్లు అయాన్‌ మీద వచ్చిన మీమ్స్‌ అన్నీ ఇన్నీ కావు. క్లింకార అయాన్‌కి మరదలు అవుతుంది కాబట్టి చరణ్‌ని ఇంప్రెస్‌ చేయడానికి అయాన్‌ ఎలాంటి పనులు చేస్తాడు. ఎంత వినయంగా ఉంటాడు. దానికి అల్లు అర్జున్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందో చెప్తూ తెగ మీమ్స్‌ చేశారు మీమర్స్‌. ఇదొక్కటే కాదు.. ఏదైనా ఫంక్షన్‌కి అయాన్‌ వస్తున్నాడంటే మీమర్స్‌ రెడీగా ఉంటారు. ఎందుకంటే మనోడు వస్తే సైలెంట్‌గా ఉండడు కదా. ఏదో ఒక మీమ్‌ మెటీరియల్‌ ఇచ్చే వెళ్తాడు. ఇలా కోతి వేశాలతో.. అల్లు అయాన్‌ కాస్త ఇంటర్నెట్‌లో మీమర్స్‌కు అయాన్‌ భాయ్‌.. అల్లు మోడల్‌గా మారిపోయాడు.