Allu Arjun: తెలుగు హీరోల మైనపు బొమ్మలే ఎందుకు పెట్టారు..?

ఇంతవరకు సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకకుడు కమల్ హాసన్, మమ్ముటి, మోహన్ లాల్‌కి కూడా ఈ గౌరవం దక్కలేదు. మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సౌత్ ఇండియా తరపున ప్రభాస్ తాలూకు మైనపు బొమ్మే ముందుగా పెట్టారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 29, 2024 | 05:25 PMLast Updated on: Mar 29, 2024 | 5:25 PM

Allu Arjuns Wax Statue At Madame Tussauds In Dubai Only Telugu Heroes Get It

Allu Arjun: దుబాయ్‌లోని మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు బొమ్మని పెట్టారు. బన్నీ కూడా వెళ్లి తన మైనపు బొమ్మతో ఫోటోలు దిగాడు. ఆ వీడియోలు నెట్‌లో హల్చల్ చేశాయి. కాకపోతే తనకంటే ముందు ప్రభాస్, మహేశ్‌కి మాత్రమే ఈ గౌరవం దక్కింది. ఆఖరికి హీరోయిన్ కాజల్ అగర్వాల్ మైనపు బొమ్మ కూడా సింగపూర్‌లో పెట్టారు. ఇంతవరకు సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకకుడు కమల్ హాసన్, మమ్ముటి, మోహన్ లాల్‌కి కూడా ఈ గౌరవం దక్కలేదు.

Tillu Square: డీజే టిల్లూ రేంజ్‌లోనే టిల్లూ స్క్వేర్ కితకితలు..?

మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సౌత్ ఇండియా తరపున ప్రభాస్ తాలూకు మైనపు బొమ్మే ముందుగా పెట్టారు. ఆ రికార్డ్ రెబల్ స్టార్ సొంతం. ఆ తర్వాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు మైనపు బొమ్మ సింగపూర్‌లో పెట్టారు. ప్రభాస్ విగ్రహం మాత్రం బ్యాంకాక్ టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టారు. బాలీవుడ్ నుంచి అమితాబ్, షారుఖ్, సల్మాన్, హృతిక్, రణ్‌వీర్ సింగ్, కరీనా, ఐశ్వర్య ఇలా చాలా మంది స్టార్స్‌కి ఈ గౌరవం దక్కింది. సౌత్‌లో మాత్రం మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో నలుగురు టాలీవుడ్ స్టార్స్ మైనపు బొమ్మలే ఉన్నాయి. అందులో మొదటిది ప్రభాస్, తర్వాత మహేశ్, ఆ తర్వాత కాజల్ అగర్వాల్, ఇప్పుడు కొత్తగా అల్లు అర్జున్ మైనపు బొమ్మ పెట్టారు.

మిగతా సౌత్ స్టార్స్‌కి ఆగౌరవం దక్కకపోవటానికి కారణం. వాళ్ల కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు ఇంత మీడియా, సోషల్ మీడియా లేకపోవటమే. ఇప్పడున్న తరంలో ప్రభాస్, బన్నీ, మహేశ్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మీద భాగా ప్రభావితం చూపటం వల్లే ఇలా జరిగిందనే అభిప్రాయముంది. ఏదేమైనా మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మలుగా రికార్డులు సృష్టించింది ముగ్గురు తెలుగు మొనగాళ్లే.