Allu Arjun: స్నేహా రెడ్డిని ఎక్కడా తగ్గొద్దంటున్న పుష్ప
సాధారణంగా ప్రతి మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది అంటారు. కానీ బన్నీ, స్నేహాలను చూస్తే ఈ మాటను తిప్పి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే తన భార్యను వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తూ కొత్త చరిత్రను సృష్టిస్తున్నారు. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఈ వ్యాపారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Allu Arjun's wife Sneha Reddy organized the first edition of the online photo studio PICABOOPUP
అల్లూ అర్జున్, స్నేహా రెడ్డి ఇద్దరూ సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేస్తూ ఉంటారు. తమ ఇంట్లో జరిగే అకేషన్ మొదలు వాళ్ళు వెళ్లిన వెకేషన్ వరకూ అన్నింటినీ అభిమానులతో పంచుకుంటారు. ఇక పిల్లలతో ఆడుకునే సందర్భాలైతే ప్రతి సారీ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇలా తన సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు స్నేహా రెడ్డి. ఇందులో భాగంగానే తాను చేసే వ్యాపారం గురించి కూడా చాలా విషయాలు అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చారు. ఈమె 2016లో PICABOO అనే పేరుతో ఒక ఆన్లైన్ ఫోటో స్టూడియోను ప్రారంభించారు. ఇది క్రమక్రమంగా వేగం పుంజుకుని విజయవంతంగా రాణిస్తుంది. ఇందులో తమ పిల్లలతో తల్లిదండ్రులు ఫోటోలు తీసుకునేందుకు తెగ ఆసక్తిచూపిస్తున్నారు. అలాంటి సెట్టింగ్స్, ఆర్ట్ డిజైన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో PICABOOPOPUP పేరుతో సరికొత్తగా రూపొందించారు. దీనిని ప్రమోట్ చేసుకునే క్రమంలో ఫస్ట్ ఎడిషన్ పేరుతో ఒక పెద్ద ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. దీనికి దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న డిజైనర్ బ్రాండ్స్ తో పాటూ బన్నీ, తన కుమార్తె అర్హ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రదానంగా మామ్ అండ్ కిడ్స్ పేరుతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో ఏర్పాటుచేసిన స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్టాల్స్ నిర్వాహకులు, యాజమాన్యంతో స్నేహా రెడ్డి సరదాగా ముచ్చటించారు. ఇలా భార్యను తాను కోరుకున్న రంగంలో ప్రోత్సహిస్తూ.. ఆమె చేపట్టే ఈవెంట్లలో సకుటుంబ సమేతంగా పాల్గొని చేదోడు వాదోడుగా నిలుస్తున్న బన్నీకి ఫ్యాన్స్ ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
T.V.SRIKAR