రష్మిక పై సీరియస్ గా అల్లు స్నేహారెడ్డి, అలియా భట్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని భాషల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు మన తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ ఆప్షన్ గా మారిపోయింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని భాషల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. యానిమల్ సినిమాతో బాలీవుడ్ లో బాగా పాపులర్ అయిన ఈ అమ్మడు ఇప్పుడు మన తెలుగులో స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ ఆప్షన్ గా మారిపోయింది. అటు కన్నడం ఇటు తమిళంలో కూడా ఆమె బిజీగానే గడుపుతోంది. ఒకప్పుడు ఆమె యాక్షన్ పై ఆమెపై విమర్శలు చేసిన అభిమానులే ఇప్పుడు ఆమె యాక్షన్ చూసి ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్పా 2 సినిమాలో ఆమె యాక్షన్ కు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు.
అయితే ఈ సినిమాలో కొన్ని డ్యాన్సులు రష్మిక చేయకుండా ఉంటే బాగుండేది అనే అభిప్రాయం కూడా కాస్త వ్యక్తమవుతుంది. ఐటమ్ సాంగ్స్ తరహాలో ఆమె డాన్స్ చేసిన విధానం ఏదో తిరునాళ్ళలో ట్రాక్టర్ పై చేసినట్టు ఉంది అంటూ కొంతమంది సెటైర్లు కూడా వేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఆ మీమ్స్ ఏంటి అనేది ఒకసారి క్లియర్ గా చూస్తే బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో యానిమల్ సినిమాలో నటించిన రష్మిక… రణబీర్ కపూర్ పక్కన హీరోయిన్ గా చేసింది.
ఆ సినిమాలో ఒక సీన్ లో రష్మిక కాళ్ళ దగ్గర రణబీర్ కపూర్ కూర్చొని ఉంటాడు. ఇక పుష్ప సినిమాలో కూడా తగ్గేదేలే అనే డైలాగ్ ను = రష్మిక కాలు పట్టు పట్టుకునే అల్లు అర్జున్ చెప్తాడు. ఇప్పుడు ఈ రెండు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ… అల్లు స్నేహారెడ్డి అలాగే అలియా భట్ ఇద్దరు రష్మికపై సీరియస్ గా ఉన్నారని, తమ మొగుళ్ళను ఆమె కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుందని, అసలు సినిమా డైరెక్టర్లను ముందు తిట్టాలని ఇద్దరు డిస్కషన్ చేసుకుంటున్నట్టుగా కొన్ని మీమ్స్ వైరల్ చేస్తున్నారు.
ఈ రెండు సినిమాల్లో రష్మికకు డైరెక్టర్లు మంచి వెయిట్ ఇచ్చారు. దీనితో ఆమె కూడా కాస్త విశ్వరూపం చూపించి నటించింది. ప్రతి విషయాన్ని సెన్సిటివ్ గా చూసే సోషల్ మీడియా ఈ విషయాన్ని కూడా కాస్త ఫన్నీగా చూస్తూ సెటైర్లు వేస్తోంది. భారీ బడ్జెట్ సినిమాలకు రష్మిక ఇప్పుడు మెయిన్ ఆప్షన్ గా మారింది. తెలుగులో మరో హీరోయిన్ లేకపోవడంతో రష్మిక పైనే ఎక్కువగా మన డైరెక్టర్లు డిపెండ్ అవుతున్నారు. అందుకే రష్మిక కూడా తన డబ్బింగ్ తను చెప్తూ బిజీ బిజీగా గడుపుతుంది.