Allu Arjun: బాలీవుడ్ హీరోల బెండు తీస్తున్న అల్లు అర్జున్..
బాలీవుడ్ హీరోల బెండుతీస్తున్నారు టాలీవుడ్ స్టార్లు. ముఖ్యంగా అల్లు అర్జున్ హిందీ హీరోల పాలిట విలనైపోయాడు. ఎందుకంటే అక్కడ హీరోలు కుల్లుకు చచ్చేంత ఫాలోయింగ్ నార్త్ లో రాబట్టుకున్న ఈ పుష్పరాజ్, ఇప్పుడు లేటెస్ట్ గా హిందీ హీరోల ఆఫర్లకి ఎసరు పెడుతున్నాడు.

Ranveer sing and allu arjun
యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో రణ్ వీర్ సింగ్ వరుసగా 6 ఫ్లాపులిచ్చాడు. అంతే తనతో చేసే ఏడో సినిమాను ఆపేసి, ఆ పాత్రని అల్లు అర్జున్ కి ఆఫర్ చేశారట. మహాభారతంలోని అశ్వధ్ధాముడి పాత్రని రణ్ వీర్ సింగ్ కి అనుకుని, చివరికి, తన సక్సెస్ రేటు మీద డౌట్ పెరగటంతో బన్నీకే ఆఫర్ చేశారట. అది కూడా 150 కోట్ల భారీ ఆఫర్ తో..
ఇదేనా సంజయ్ లీలా భన్సాలి ప్లాన్ చేసిన మరో మూవీ హ్రితిక్ రోషన్ తో అనుకున్నాడట. తర్వాత రణ్ వీర్ సింగ్ తో గతంలో హిట్స్ వచ్చాయని తనతో అనుకున్నడట. చివరికి అది విజయ్ దేవరకొండని వరించిందని తెలుస్తోంది. ఇక హ్రితిక్ మరో ఆఫర్ ని రామ్ చరణ్ పట్టేసేలా ఉన్నాడు. ఆల్రెడీ ప్రభాస్ బాలీవుడ్ లో ఆఫర్లు లాగేసుకుంటున్నాడు. సో మొత్తానికి బాలీవుడ్ మార్కెట్ నే కాదు ఆఫర్లను కూడా కబ్జా చేస్తూ తెలుగు హీరోలు, బాలీవుడ్ స్టార్ల నడ్డి విరగ్గొట్టేస్తున్నారు.