Kalki song : వచ్చేసిన భైరవ ఆంథమ్..కుమ్మేసిన ప్రభాస్
లేటుగా వచ్చినా.. లేటెస్ట్ గా వచ్చాడు ‘భైరవ‘ (Bhairava). రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి' (Kalki) నుంచి ఫస్ట్ సింగిల్ ‘భైరవ ఏంథెమ్‘ (Bhairava Antham) వచ్చేసింది.

Although it came late.. 'Bhairava' came the latest. Rebel Star Prabhas' first single from 'Kalki' 'Bhairava Anthem' is here.
లేటుగా వచ్చినా.. లేటెస్ట్ గా వచ్చాడు ‘భైరవ‘ (Bhairava). రెబెల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి’ (Kalki) నుంచి ఫస్ట్ సింగిల్ ‘భైరవ ఏంథెమ్‘ (Bhairava Antham) వచ్చేసింది. ‘ఒకనేనే నాకు చుట్టూ నేనే.. ఒకటైన ఒంటరోడ్ని కానే.. స్వార్థము నేనే.. పరమార్థము నేనే..‘ అంటూ రామజోగయ్య శాస్త్రి (Ramajogaiah Shastri), కుమార్ రాసిన ఈ గీతాన్ని దీపక్ బ్లూ, దిల్జీత్ దొసాంజ్, సంతోష్ నారాయణన్ సంయుక్తంగా ఆలపించారు. సంతోష్ నారాయణన్ సంగీతంలో రూపొందిన ఈ పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
ఇక.. ఇండియాస్ మోస్ట్ సెలబ్రేటెడ్ యాక్టర్ ప్రభాస్ (Prabhas), ఇండియాస్ మోస్ట్ సెలబ్రేటెడ్ సింగర్ దిల్జీత్ కలిసి ఈ పాటలో సందడి చేశారు. భైరవ పాత్ర సాహసాలను, వ్యక్తిత్వాన్ని చూపిస్తూ సాగిన ఈ పాట డార్లింగ్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటుంది.ఈ సాంగ్ తెలుగు విత్ పంజాబీ లిరిక్స్ తో మిక్స్ అయి ఉంది. ఇక సాంగ్ లో ప్రభాస్ లుక్స్ చాలా స్టైలిష్ గా ఉన్నాయి. అంతేకాక సాంగ్ చివర్లో ప్రభాస్ పంజాబీ లుక్ లో అదిరిపోయాడు. అదే లుక్ లో పంచె ఎత్తి అలా స్టైల్ గా నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ డార్లింగ్స్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా ‘భైరవ ఆంథమ్’ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచింది
ఇదిలా ఉంటే పాన్ వర్డల్ గా ఫోకస్ పెరిగిన ఈ మూవీని డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) నెవర్ బిఫోర్ అనేలా తెరకెక్కిస్తున్నాడు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీపై ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. ఇక విడుదల తేదీ దగ్గరపడటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగం పెంచారు. ఇప్పటికే మూవీ నుంచి టీజర్‌తో పాటు ట్రైలర్‌లు విడుదల చేయగా యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. ఇప్పడు వచ్చిన ఫస్ట్ సింగిల్ అప్పుడే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.