Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉండాలో పోవాలా.. మరీ దారుణంగా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి షాక్ మీద షాకు తగులుతోంది. ఒకవైపు బ్రో పోస్టర్ లో పవన్ కళ్యాణ్ తమ్ముడు పాటలో వేసిన గెటప్ వేశాడు. సాయితేజ్ తో కలిసి సేమ్ లుక్ లో షాక్ ఇచ్చాడు. ఇక టీజర్ సందడి అనగానే ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అంతలోకే ఓజీ నుంచి మైండ్ బ్లాంక్ అయ్యే న్యూస్ వచ్చింది.

Although there are many Pawan Kalyan films, none of them have been properly planned
ఓజీ ఏకంగా 50శాతం షూటింగ్ పూర్తవటం ఒక ఎత్తైతే, జులై, ఆగస్ట్ లో మరో రెండు భారీ షెడ్యూల్స్ లో సినిమా మొత్తం పూర్తి చేయాలనుకోవటం మరో ఎత్తు. పాటల షూటింగ్ ని ఆగస్ట్ లో, టాకీ పార్ట్, యాక్షన్ పార్ట్ ని జులైలో పూర్తి చేయబోతోంది సుజీత్ టీం.
అంతా బానే ఉంది కాని బ్రో, ఓజీ వేగం చూస్తుంటే ఉస్తాద్ భగత్ సింగ్ పరిస్థితే అర్ధం కావట్లేదు. త్రివిక్రమ్ సపోర్ట్ లేకుండా తెరకెక్కుతోన్న మూవీ కాబట్టి మరో షెడ్యూల్ కి పవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇక హరి హర వీరమల్లు అయితే ఎప్పుడు పూర్తవుతుందో తెలియట్లేదు. ఆ కథ కంచికి చేరే పరిస్థితే కనిపించట్లేదు. ఏదేమైనా సుజీత్ వేగం, పవన్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేలా ఉంది. ఓజీ క్రిస్మస్ కు రావటం పక్కా అని తెలుస్తోంది.