Amala Paul : అమ్మయిన అమలాపాల్… బాబుతో ఎమోషనల్ టచ్
అమలాపాల్ అమ్మగా ప్రమోషన్ పొందింది. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. జూన్ 11న బాబు పుట్టాడని.. బుడ్డోడికి ‘ఇళై’ అని పేరు పెట్టామని సోషల్ మీడియా వేదికగా తెలిపింది అమలా పాల్.
అమలాపాల్ అమ్మగా ప్రమోషన్ పొందింది. పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. జూన్ 11న బాబు పుట్టాడని.. బుడ్డోడికి ‘ఇళై’ అని పేరు పెట్టామని సోషల్ మీడియా వేదికగా తెలిపింది అమలా పాల్. ఆమె భర్త జగత్ దేశాయ్ కూడా ఇదే పోస్ట్ ను షేర్ చేశారు. ఇట్స్ బేబీ బాయ్.. మా చిన్ని అద్భుతాన్ని చూసేయండి అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. దీంతో ఫ్యాన్స్ తో పాటు సెలబ్రెటీలు అమలాపాల్ దంపతులకు విషెస్ చెబుతున్నారు.ఇక ఇప్పుడు అమ్మవడంతో అమలా పాల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
జగత్ దేశాయ్ తో అమలా పాల్ వివాహం గతేడాది జరిగింది. ఈ దంపతులిద్దరూ ఎప్పటికప్పుడు తమ విశేషాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. గతంలో దర్శకుడు ఎ.ఎల్.విజయ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది అమలా పాల్. వాళ్లిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు.అనంతరం జగత్ ను ప్రేమించి పెళ్లి చేసుకుని మగబిడ్డకు జన్మించారు. ఇక బాబు పుట్టిన తర్వాత ఇంట్లోకి వచ్చిన బిడ్డకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు ఫ్యామిలీ మెంబర్ . తన కుమారుడిని చేతుల్లో ఎత్తుకొని ఇంట్లోకి సంతోషంగా అడుగుపెట్టారు అమలా పాల్. అప్పటికే కుటుంబ సభ్యులు ఇంటిని అందంగా డెకరేట్ చేశారు. తమ రూమ్‍కు వెళ్లిన అమల సర్‌ప్రైజ్ అయ్యారు. ఈ వీడియో అద్భుతంగా ఉంది.
సినిమాల విషయానికొస్తే.. ‘నాయక్, ఇద్దరమ్మాయిలు’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అమలాపాల్.. తమిళ, మలయాళ సినిమాలలో బాగానే పేరు తెచ్చుకుంది. ఇక.. చాలా కాలం తర్వాత బోల్డ్ మూవీ ‘ఆమె’తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభంచిన అమలా పాల్.. ఈ ఏడాది ‘ఆడు జీవితం’ సినిమాతో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అమలా పాల్ కిట్టీలో రెండు మలయాళం సినిమాలున్నాయి.