Amala Paul: కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న హీరోయిన్..
తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. కొంతకాలం డేటింగ్‌లో ఉన్న ఇద్దరూ గత నవంబర్ 5న పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే.. అంటే గత జనవరి 3న ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అమలాపాల్.

Amala Paul: కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమలాపాల్ అభిమానులతో గుడ్ న్యూస్ పంచుకున్నారు. తాను త్వరలో కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 2 హ్యాపీ కిడ్స్ అంటూ.. తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో త్వరలోనే అమలపాల్ కవల పిల్లలకు జన్మనివ్వబోతుందని అర్థమైంది. తెలుగుతోపాటు తమిళం, మళయాలం సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది అమలాపాల్.
BRS Krishank: రేవంత్ సోదరుడిపై ఆరోపణలు.. BRS సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్‌పై కేసు !
గతంలో తమిళ దర్శకుడు విజయ్‌ను పెళ్లి చేసుకుంది. అయితే, ఆ తర్వాత కొంతకాలానికే మనస్పర్ధల కారణంగా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. తర్వాత తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను రెండో పెళ్లి చేసుకుంది. కొంతకాలం డేటింగ్‌లో ఉన్న ఇద్దరూ గత నవంబర్ 5న పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొద్ది రోజులకే.. అంటే గత జనవరి 3న ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది అమలాపాల్. దీంతో ఆమె పెళ్లికి ముందే గర్భవతి అయిందనే అనుమానాలు తెర మీదకు వచ్చాయి. అయితే, ప్రెగ్నెన్సీ గురించి వెల్లడించినప్పటి నుంచి వెకేషన్స్‌లో ఎంజాయ్ చేస్తూ.. తన బేబీ బంప్ ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా ట్విన్స్ గురించి హింట్ ఇచ్చింది. ప్రస్తుతం అమలాపాల్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
దీంతో ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియా వేదికగా అమలా పాల్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. పెళ్లైనప్పటికీ అమలాపాల్ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ నెలలోనే విడుదల కానున్న మలయాళ మూవీ ఆడు జీవితం సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ సరసన హీరోయిన్‌గా చేసింది. ఆ తర్వాత ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో నటిస్తోంది. తెలుగులో రామ్ చరణ్ సరసన నాయక్, అల్లు అర్జున్‌తో ఇద్దరమ్మాయిలతో వంటి చిత్రాల్లో నటించింది.
View this post on Instagram