Amala Paul: తల్లి కాబోతున్న తెలుగు హీరోయిన్
ప్రపోజల్, పెళ్లి న్యూస్‌ని ఎంత ఫాస్ట్‌గా చెప్పిందో.. ఇప్పుడు ప్రెగ్నెన్సీని కూడా అంతే ఫాస్ట్ చెప్పేసింది అమలాపాల్. ఇన్‌స్టా పోస్టులో అమలా పాల్ బేబీ బంప్‌తో కనిపిస్తోంది.

Amala Paul: ఈ మధ్యే రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్.. అభిమానులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తల్లికాబోతున్నట్లు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. జగత్ దేశాయ్‌తో నవంబర్ 5న అమలాపాల్ పెళ్లి జరిగింది. ఫస్ట్ మ్యారేజ్ బ్రేకప్ తర్వాత.. జగత్ ప్రపోజ్ చేయడం.. అమలాపాల్ యాక్సెప్ట్ చేయడం చకచకా జరిగిపోయాయ్.
MAHESH BABU: బార్బారికుడిగా మారుతున్న సూపర్ స్టార్.. మహేశ్-రాజమౌళి సినిమా టైటిల్ ఇదే..
ప్రపోజల్, పెళ్లి న్యూస్‌ని ఎంత ఫాస్ట్‌గా చెప్పిందో.. ఇప్పుడు ప్రెగ్నెన్సీని కూడా అంతే ఫాస్ట్ చెప్పేసింది అమలాపాల్. ఇన్‌స్టా పోస్టులో అమలా పాల్ బేబీ బంప్‌తో కనిపిస్తోంది. నేను ఇప్పుడు నీతో కలిసి ముగ్గురు కాబోతున్నాము అంటూ అమలాపాల్ రాసుకొచ్చింది. ఈ పోస్టు చూసిన అభిమానులు.. కంగ్రాట్స్ చెప్తున్నారు. మరికొంతమంది మాత్రం మొన్ననే పెళ్లి అయంది కదా అని ప్రశ్నలు వేస్తున్నారు. జగత్ దేశాయ్‌తో అమలాపాల్‌కి ఇది రెండో పెళ్లి. 2014లో డైరెక్టర్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్.. 2017లో విడిపోయింది.
ఆ తర్వాత 2018లో తన స్నేహితుడు సింగర్ భవీందర్ సింగ్‌ను అమలాపాల్ పెళ్లాడినట్లు వార్తలు వచ్చాయ్. వాళ్లిద్దరికి పెళ్లి జరిగినట్లు ఓ ఫోటో కూడా మీడియాల్లో చక్కెర్లు కొట్టింది. ఐతే ఆ ఫోటో ఓ షూట్‌లో భాగమని చెప్పి పెళ్లి వార్తలను కొట్టేశారు. ఆ తర్వాత భవీందర్ సింగ్‌తో కూడా విభేదాలు వచ్చి.. అమలా పాల్ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. కొన్నాళ్లుగా జగత్ దేశాయ్‌తో డేటింగ్ చేస్తున్న ఈ భామ.. అతడితో ఉన్న ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి వరకు తీసుకొచ్చి.. కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. ఇప్పుడు తల్లికాబోతోంది.