Bigg Boss : బిగ్ బాస్ హౌస్ లో.. హత్య కేసులను ఛేదించిన అమర్, అర్జున్..
బిగ్ బాస్ హౌస్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. బిగ్ బాస్ వైఫ్ మర్డర్ తర్వాత ఒకరి తర్వాత ఒకరు హత్యకు గురవుతున్నారు. దీంతో తమ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నారు అమర్,అర్జున్. ప్రశాంత్ మర్డర్ తర్వాత అశ్వినీ హత్యకు గురికావడంతో కేసును సీరియస్ గా తీసుకుని ఇంటిసభ్యులను విచారిస్తున్నారు.

Amar and Arjun who solved the murder case in Bigg Boss house..
బిగ్ బాస్ హౌస్ లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. బిగ్ బాస్ వైఫ్ మర్డర్ తర్వాత ఒకరి తర్వాత ఒకరు హత్యకు గురవుతున్నారు. దీంతో తమ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నారు అమర్,అర్జున్. ప్రశాంత్ మర్డర్ తర్వాత అశ్వినీ హత్యకు గురికావడంతో కేసును సీరియస్ గా తీసుకుని ఇంటిసభ్యులను విచారిస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి ఒకరిని ఎంక్వరీ చేయడంతో పాటు కెప్టెన్సీ కంటెండర్ గురించి మాట్లాడుతూ షోను ఇంట్రెస్టింగ్ మార్చేస్తున్నారు. మధ్య మధ్య లో శివాజీ తనకిచ్చిన టాస్క్ లను విజయవంతంగా పూర్తి చేస్తున్నాడు. అయితే.. శివాజీనే వరుస హత్యలు చేస్తున్నారని గుర్తించి. జైలుకి పంపించారు. కట్ చేస్తే మరో హత్య జరగ్గా.. షాక్ కు గురవుతారు ఇంటి సభ్యులు.
Animal: రెండు భాగాలుగా యానిమల్.. రెండో భాగం ఎప్పుడంటే..
శివాజీని అసలు నిందితుడు అని తేల్చేందుకు రతికా అమర్ తో యావర్ ,ప్రియాంక, గౌతమ్ ను ఇన్వస్టిగేషన్ చేసి నిజాలను బయటకు తీస్తున్నారు. అయితే గౌతమ్ రతిక కు సంబంధించిన సీక్రెట్స్ గురించి పోలీసులకు చెప్పేశాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేదని.. చెప్పగా.. మరో హత్య కూడా జరగడంతో.. రతికను అనుమానంతో జైల్లో వేశారు అమర్, అర్జున్. తర్వాత మరో మర్డర్ చేయడానికిలో శివాజీ ప్రియాంక సాయం తీసుకుని గౌతమ్ ను హత్య చేయించాడు. ఇలా కొనసాగుతుండగానే.. బిగ్ బాస్ రెండో హత్య చేసింది ఎవరో చెప్పాలంటూ అమర్ అర్జున్ ను ఆదేశించాడు బిగ్ బాస్. దీంతో ప్రియాంక పేరు చెప్పారు. ఆధారాలు కావాలంటూ అడగ్గా.. అమర్, అర్జున్ లు విచారణ లో జరిగిన విషయాలతో పాటు వారు గుర్తించిన విషయాలను బిగ్ బాస్ కు రివీల్ చేశారు. కానీ విషయాలు కరెక్ట్ గా లేకపోయినప్పటికి.. హంతకురాలిగా గుర్తించడంలో సక్సెస్ అయ్యారు బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. అంతేకాక ప్రియాంక, శివాజీ దగ్గర ఉన్న నగ, ఫోన్ను బిగ్ బాస్ తీసుకున్నాడు. అంతేకాక టాస్క్ అయిపోయిన్నట్లు అనౌన్స్ చేశాడు
ఇక ఈ రోజు బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్క్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. పోటీలో పాల్గొనే అభ్యర్థులను బిగ్ బాస్ చెప్పే అవకాశం ఉంది. అయితే ఈ వారం చివరి కెప్టెన్సీ కోసం పోటీ జగరుతుంది. మరీ ఈ టాస్క్ లో అభ్యర్థులుగా ఎవరు ఉంటారు ఎవరు గెలుస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది. అసలు కెప్టెన్ ఎవరో తెలియాలంటే ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.