Bigg Boss : బిగ్ బాస్ హౌస్ లో అమర్ బర్త్ డే వేడుకలు.. తేజూ ఏం చేసిందంటే..
బిగ్ బాస్ (Bigg Boss) హౌస్ లో కళకళలాడుతోంది. కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ తో సీల్ అవుతున్నారు. ఇంటి సభ్యులను చూసి.. హౌస్ మేట్స్ ఎమోషనల్ అవుతున్నారు.

Amars birthday celebrations in Bigg Boss house What did Teju do
బిగ్ బాస్ (Bigg Boss) హౌస్ లో కళకళలాడుతోంది. కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ తో సీల్ అవుతున్నారు. ఇంటి సభ్యులను చూసి.. హౌస్ మేట్స్ ఎమోషనల్ అవుతున్నారు. బుధవారం నుంచి మొదలైన ఫ్యామిలీ వీక్ లో కంటిన్యూ అవుతోంది. శివాజీ కొడుకు అర్జున్ భార్య, గౌతమ్ మదర్, ప్రియాంక బాయ్ ఫ్రెండ్ ,భోలే సతీమణి, అశ్విని తల్లి ఎంటర్ అవ్వగా.. రీసెంట్ గా అమర్ భార్య తేజస్విని, శోభాశెట్టి తల్లి, యావర్ బ్రదర్ ఇంట్లో వచ్చారు. ఓ వైపు బిగ్ బాస్ అమర్ దీప్ ను తెగ పట్టించాడు.
ఇంటి సభ్యులు.. గ్రూపులు గ్రూపులుగా ఒక చోట చేరి ముచ్చట్లు పెట్టుకున్నారు. అంతలో అమర్ దీప్ ను బిగ్ బాస్ కన్సెషన్ రూమ్ కు పిలిచాడు. అమర్ అటు వెళ్లగానే.. తేజస్విని ఇంట్లోకి ఎంటర్ ఇచ్చింది. అయితే బిగ్ బాస్ అమర్ కాసేపు సరదాగా ఆటపట్టించాడు. తేజస్విని కి రావడం కుదరదని.. కేక్ పంపించిందని చెప్పాడు. దీంతో కాస్త నిరాశ పడ్డ అమర్.. పర్వాలేదు.. నా కోసం కేక్ పంపించిందని హ్యాపీగా ఫీలయ్యాను. తర్వాత ఇంటి సభ్యులతో కలిసి సెలబ్రేషన్స్ సూచించడంతో పాటు హ్యాపీ బర్త్ డే చెప్పాడు బిగ్ బాస్. బయటకు వచ్చిన అమర్ తేజు రాలేదని.. కేక్ పంపించిందని చెబుతుండగా… ఎదురుగా భార్య తేజస్విని కనిపించడంతో ఎమోషనల్ అయ్యాడు. హగ్ చేసుకుని.. ముద్దులు పెట్టుకున్నారు. తేజస్విని అమర్ ఆట సంబంధించిన రివ్యూ ఇచ్చింది. మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉందని.. తన మనసులో మాటలను పదే పదే చెప్పాడు అమర్. దీంతో తేజస్విని తెగ సిగ్గుపడిపోయింది. ఇంటి సభ్యుల ఆటతీరు గురించి చెప్పడంతో పాటు వారితో సరదాగా ముచ్చటించిన తేజస్విని.
ఇక ఇంట్లోకి శోభాశెట్టి మదర్ కూడా వచ్చేసింది. తల్లిని చూడగానే.. కన్నీరు పెట్టుకోవడంతో పాటు గట్టిగా హగ్ చేసుకుని ముద్దులతో ముంచెత్తింది.c అమ్మలేదని అనుకోకు.. నువ్వు నా కొడుకువి అంటూ ఓదార్చిన తీరు.. ఆడియెన్స్ కు సైతం కన్నీరు తెప్పించింది. తర్వాత ఇంటి సభ్యుల ఆటతీరును చెప్పుకు రావడంతో.. కూతురికి కోపం తగ్గించుకోమని సలహా ఇచ్చింది. ఇక చివరగా యావర్ బ్రదర్ ఇంట్లోకి వచ్చాడు.. బ్రదర్ ని చూడగానే.. గట్టిగా హగ్ చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. ఇంటి సభ్యులతో సరదాగా మాట్లాడాడు. గేమ్ బాగా ఆడుతున్నారు అని మెచ్చుకోవడంతో పాటు.. కప్పు ముఖ్యం అని సలహా ఇచ్చాడు. మొత్తానికి హౌస్ లో సందడి వాతావరణం కనిపించింది..