Ambati Rambabu: పవన్ కు అంబటి రాంబాబు కౌంటర్.. ఇది మామూలు రచ్చ కాదు బ్రో..
సినిమాల్లో రాజకీయాలను మిక్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు.. కానీ సినిమాల్లో పొలిటికల్ డైలాగులు వాడుకోవడం కామన్ ట్రెండ్ గా మారింది.

Ambati Rambabu Strong Counter To Pawan Kalyan Bro Movie Shaym Babu Charector
ఇదే క్రమంలో పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాలోని ఒక సన్నివేశం ఇప్పుడు రాజకీయంగా రచ్చ చేస్తోంది. ఈ సీన్ కు సంబంధించి స్పందిస్తూ మంత్రి అంబటి రాంబాబు.. పవన్ కు చురకలంటించారు. బ్రో సినిమాలో కొన్ని పొలిటికల్ డైలాగులు ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి ‘మాటల మాంత్రికుడు’ అనే ట్యాగ్ ను నిలబెట్టుకున్నారు. వకీల్ సాబ్ తో పోలిస్తే తక్కువగానే ఉన్నా.. ఇందులో కూడా పొలిటికల్ పంచ్ లు పేలాయి.
సినిమాలోని ఓ పబ్ సన్నివేశంలో శ్యాంబాబు పాత్ర పోషించిన 30 ఇయర్స్ పృథ్వీ.. అంబటి రాంబాబు డాన్స్ మూవ్స్ మాదిరిగానే ఇమిటేట్ చేశారు. పవన్ తన డాన్స్ స్టెప్పులపై శ్యాంబాబుకు క్లాస్ తీసుకుంటాడు. అక్కడ పవన్ చెప్పే డైలాగ్స్ , శ్యాంబాబుకు డాన్స్ రెండూ అంబటిని సూటిగా ప్రస్తావించినవిగా ఉన్నాయి. సంక్రాంతి సంబురాల్లో భాగంగా తన నియోజకవర్గంలో జరిగిన వేడుకలలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు హుషారుగా చిందులేశారు. దీనినే బ్రో సినిమాలో పేరడీ పేరిట చూపించారు. దీనిపై స్పందించిన మంత్రి అంబటి.. వపన్ కు చురకలంటిస్తూ. ట్వీట్ చేశారు. గెలిచినోడి డాన్స్ సంక్రాంతి! ఓడినోడి డాన్స్ కాళరాత్రి ! అంటూ నేరుగా పవన్ కళ్యాణ్ కు ట్యాగ్ చేశారాయన. దీంతో రచ్చ మరింత కంటిన్యూ కావడం ఖాయంగా కనిపిస్తుంది.