సిల్వర్ స్క్రీన్ పై అంబటి రాయుడు… బయోపిక్ తో ఎంట్రీ…?
ఇండియా వైడ్ గా బయోపిక్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. క్రికెటర్లు అలాగే ఆర్మీ లో ప్రాణాలు వదిలిన వ్యక్తుల జీవితాలపై వచ్చే బయోపిక్ లకు మంచి క్రేజ్ ఉంటుంది. దీనితో నిర్మాతలు కూడా ఆ సినిమాలపై భారీ పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారు.
ఇండియా వైడ్ గా బయోపిక్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. క్రికెటర్లు అలాగే ఆర్మీ లో ప్రాణాలు వదిలిన వ్యక్తుల జీవితాలపై వచ్చే బయోపిక్ లకు మంచి క్రేజ్ ఉంటుంది. దీనితో నిర్మాతలు కూడా ఆ సినిమాలపై భారీ పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ముకుంద్ వరదరాజన్ బయోపిక్ కు మంచి వసూళ్లు వచ్చాయి. దీనితో ఇప్పుడు మన తెలుగులో కూడా బయోపిక్ లపై మళ్ళీ ఫోకస్ పెడుతున్నారు. కొన్నాళ్లపాటు తెలుగులో బయోపిక్ లకు మంచి డిమాండ్ నడిచింది.
కానీ మళ్ళీ ఎందుకో వాటిని పక్కన పెట్టారు మన స్టార్ హీరోలు. అయితే ఇప్పుడు మళ్లీ వాటి ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలుగు మాజీ స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు జీవితం పై ఒక బయోపిక్ ను ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. అంబటి రాయుడు జీవితంలో సినిమాలను మించి ఎలివేషన్ లు సీన్లు ఉంటాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన గొడవలు అప్పట్లో పెద్ద దుమారమే రేపాయి. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి బరోడా వెళ్లి అక్కడ మంచి ప్రదర్శన చేసి జాతీయ జట్టుకు కూడా ఎంపికయ్యాడు.
అయితే జాతీయ జట్టులో కూడా అతనికి అవకాశాలు ఆశించిన స్థాయిలో రాలేదు. దీనిపై అప్పట్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక టీమిండియా కు చీఫ్ సెలెక్టర్ గా పని చేసిన ఎమ్మెస్కే ప్రసాద్ అంబటి రాయుడుకు అవకాశాలు ఇవ్వలేదని, కుల పిచ్చి అంటూ కామెంట్స్ చేసారు. 2019 ప్రపంచ కప్ కు అంబటి రాయుడుని ఎంపిక చేయకపోవడం అప్పట్లో పెద్ద సంచలనమే అయింది. ఇక క్రికెట్ కు గుడ్ బై చెప్పి అమ్మటి రాయుడు రాజకీయాల్లోకి కూడా కొన్నాళ్లపాటు అడుగుపెట్టాడు.
వైసీపీలో జాయిన్ అయి బయటకు వచ్చి మళ్లీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు 2024 ఎన్నికల్లో మద్దతు కూడా ఇచ్చారు. దీనితో అతని బయోపిక్ కోసం ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. కచ్చితంగా సిల్వర్ స్క్రీన్ పై రికార్డులు బద్దలు కొడుతుంది అనే ధీమాలో మేకర్స్ అన్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సితార ఎంటర్టైన్మెంట్స్ పెట్టుబడి పెట్టనున్నట్లు ముందు అనుకున్నా తర్వాత ఒక కొత్త నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతుందట. దిల్ రాజుతో అత్యంత సన్నిహితంగా ఉండే నిర్మాణ సంస్థ ఇందుకు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తోంది. అయితే హీరోగా ఎవరు నటిస్తారనే తెలియకపోయినా కొత్త వ్యక్తిని పరిచయం చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆంధ్ర క్రికెట్ కు కొన్నాళ్లు ప్రాతినిధ్యం వహించి సినిమా చాన్సుల కోసం ప్రయత్నాలు చేస్తున్న ఒక కొత్త నటుడిని ఈ సినిమాలో పరిచయం చేయనున్నారు మేకర్స్. అయితే స్వయంగా అంబటి రాయుడు నటించే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతోంది.