ఎన్టీఆర్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్”.. మరోసారి ప్రూవ్ చేసిన అమెరికా సింగర్

త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మారిపోయింది. ఆ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వడంలో ఎన్టీఆర్ కీ రోల్ ప్లే చేశాడు. ఎన్టీఆర్ సెకండ్ హీరో అని ఎవరికి నచ్చిన కామెంట్స్ వాళ్ళు చేసినా...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 11, 2025 | 03:15 PMLast Updated on: Feb 11, 2025 | 3:15 PM

America Siger Sing To Song Ntr Song

త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ మారిపోయింది. ఆ సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వడంలో ఎన్టీఆర్ కీ రోల్ ప్లే చేశాడు. ఎన్టీఆర్ సెకండ్ హీరో అని ఎవరికి నచ్చిన కామెంట్స్ వాళ్ళు చేసినా… తన యాక్టింగ్ తో సినిమాకు ప్రాణం పోశాడు. సినిమా విషయంలో డాన్స్ తో కూడా దుమ్ము రేపటంతో వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ పేరు మార్మోగిపోయింది. ఇక కొన్ని చోట్ల అయితే రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ కు ఎక్కువగా పేరు వచ్చింది. ఆ సినిమాలో యాక్టింగ్ విషయంలో రామ్ చరణ్ కంటే ఎన్టీఆర్ బెటర్ అనే కామెంట్స్ చాలామంది నుంచి వినిపించాయి.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ బ్రాండ్ గా మారిపోయాడు. ఎన్టీఆర్ పేరు ఇప్పుడు ఇంటర్నేషనల్ వైడ్ గా మారుమోగిపోతుంది. గ్లోబల్ వేదికలపై ఎన్టీఆర్ పేరు వినిపించడం సాధారణ విషయంగా మారింది. రీసెంట్ గా ఫిఫా వరల్డ్ కప్ ఫుట్ బాల్ ప్లేయర్స్ నైమర్, టేవేజ్, రోనాల్డోల పుట్టినరోజు సందర్భంగా నాటు నాటు స్టెప్పులతో హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అని పోస్ట్ చేయడం గ్లోబల్ వైడ్ గా సెన్సేషన్ అయింది. ఇక లేటెస్ట్ గా ఇండియా టూర్ లో బిజీబిజీగా ఉన్న అమెరికన్ పాప్ ఐడల్ ఎడ్ షీరాన్ .. బెంగళూరులో ఒక కన్సర్ట్ లో సింగర్ శిల్పారావు తో కలిసి దేవర సినిమాలోని చుట్టమల్లె సాంగ్ ను పాడి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

ఈ పాటను తెలుగులో పాడటం చాలా స్పెషల్ గా ఫీల్ అయ్యాడు ఎన్టీఆర్. దీనిగురించి ఎక్స్ లో ఒక పోస్ట్ కూడా పెట్టాడు. సంగీతానికి బౌండరీలు లేవని.. ఎడ్ ఈ పాటని పాడటం చాలా స్పెషల్ గా అనిపించిందని కామెంట్ చేశాడు. ఇక ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అకాడమీ… కూడా తన సోషల్ మీడియా ఎకౌంటు ద్వారా ఇద్దరు ఇండియన్స్ ను మాత్రమే ఫాలో అవుతుంది. అందులో ఒకరు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖాన్… కాగా మరొకరు ఎన్టీఆర్. దీనితో ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

దేవర సినిమా సక్సెస్ తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఒక సినిమా చేస్తున్నాడు. వార్ 2 తో ఎన్టీఆర్ బాలీవుడ్ లో పరిచయం కాబోతున్నాడు. ఆ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవడంతో ఇప్పుడు.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయబోయే సినిమా కోసం కష్టపడుతున్నాడు. త్వరలో ఈ సినిమా షూటింగ్లో ఎన్టీఆర్ పాల్గొంటాడు. ఈ సినిమాను వచ్చేయడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇక సెప్టెంబర్ లో వార్ 2 సినిమా రిలీజ్ అవుతుంది. ఇలా రెండు ఏళ్ళలో మూడు సినిమాలు టార్గెట్ పెట్టుకొని ఎన్టీఆర్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్లా ఉన్నారు. దానికి తోడు ఇలా ఇంటర్నేషనల్ వేదికలపై ఎన్టీఆర్ పేరు వినపడటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.