Aishwarya Rai Bachchan: ఐశ్వర్య రాయ్ విడాకులు.. రూమర్స్ కావా.?
మామూలుగా మామ మాటకి ఎదురు చెప్పని ఐష్, ఫస్ట్ టైం ఆస్తి విషయంలో కలగచేసుకుందట. తాముండే జల్సా విల్లాని కూడా కూతురుకి అమితాబ్ రాసివ్వటం విషయంలో, అభిషేక్‌కి, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కి మధ్య మనస్పర్ధలు వచ్చాయని ప్రచారం కూడా జరుగుతోంది.

Aishwarya Rai Bachchan: అమితాబ్ బచ్చన్ కోడలు, అభిషేక్ బచ్చన్ భార్య అయిన ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఇప్పుడు విడాకులు ఇస్తోందన్న వార్త రోజుకో రకంగా మారిపోతోంది. మొన్నటికి మొన్న అమితాబ్ బచ్చన్ తన యావదాస్తిని కొడుకు అభిషేక్‌కి, అలానే కూతురికి చెరి సమానంగా పంచాడు. అలా కూతురు, కొడుక్కి చెరో రూ.1600 కోట్ల ఆస్తులు పంచాడు అమితాబచ్చన్. అక్కడే ఐశ్వర్యకి, అమితాబ్‌కు మధ్య చిన్న చర్చ జరిగిందట. మామూలుగా మామ మాటకి ఎదురు చెప్పని ఐష్, ఫస్ట్ టైం ఆస్తి విషయంలో కలగచేసుకుందట.
SAI PALLAVI: మళ్లీ సాయిపల్లవిని లేడీ పవర్ స్టార్ అనేస్తున్నారా..?
తాముండే జల్సా విల్లాని కూడా కూతురుకి అమితాబ్ రాసివ్వటం విషయంలో, అభిషేక్‌కి, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కి మధ్య మనస్పర్ధలు వచ్చాయని ప్రచారం కూడా జరుగుతోంది. అటు అమితాబ్ మాటకి ఎదురుచెప్పటం, ఇటు అభిషేక్‌తో గొడవ అవటంతో ఐశ్వర్యతో డివోర్స్ అంటూ ప్రచారం మొదలైంది. అంతేకాదు ఐశ్వర్య ఇన్‌స్టాని అమితాబ్ అన్ ఫాలో చేశాడనే వార్తలొచ్చాయి. ఐతే కొందరు కౌంటర్‌గా అసలు అమితాబ్ ఎన్నడు కోడలు ఐశ్వర్య ఇన్‌స్టాని ఫాలో అయ్యాడని.. ఇప్పుడు అన్ ఫాలో చేస్తాడనంటున్నారు.
కొందరైతే ప్రైవసీ సెట్టింగ్స్‌లో మార్పు వల్లే అమితాబ్ ఐష్‌ని అన్ ఫాలో చేసినట్టు పొరబడుతున్నారని బిగ్ బీ ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అమితాబ్ ఫ్యామిలీ నుంచి కాని, అభిషేక్ సోషల్ మీడియా టీంనుంచి కాని రెస్పాన్స్ లేకపోవటంతో ఐష్ విడాకుల వార్తలు రూమర్స్ మాత్రమే కాదనుకునే పరిస్థితి కనిపిస్తోంది.