స్టార్ అంటే అలాంటి వాడే… కుండబద్దలు కొట్టేశాడు…!
స్టార్ అంటే నువ్వే.. నువ్వే స్టార్ అనేశాడు బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కే సూటయ్యే స్టేట్ మెంట్లు ఇచ్చాడు. గొప్పగా ఫైట్ చేస్తోనో, నటిస్తేనో కాదు, అంతకుమించి జనాలను థియేటర్స్ కి రాబట్టే వాడే స్టార్ అన్నాడు.
స్టార్ అంటే నువ్వే.. నువ్వే స్టార్ అనేశాడు బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కే సూటయ్యే స్టేట్ మెంట్లు ఇచ్చాడు. గొప్పగా ఫైట్ చేస్తోనో, నటిస్తేనో కాదు, అంతకుమించి జనాలను థియేటర్స్ కి రాబట్టే వాడే స్టార్ అన్నాడు. దేవరకి ముందు జనాలు థియేటర్స్ రావాలంటే ఇంట్రస్ట్ చూపించలేదు. కల్కీకి ముందు కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. కాని రెబల్ స్టార్ ఎలాగైతే కల్కీతో జనాలను థియేటర్స్ కి రాబట్టగలిగాడో, దేవరతో ఎన్టీఆర్ అదే పని చేశాడు. కాకపోతే ఇక్కడ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మీద కామెంట్లు, ట్రోలింగ్స్, కొన్ని నెగెటీవ్ రివ్యూలు ఇలా చాలా డ్యామేజింగ్ ఎటాక్స్ జరిగాయి. కాని సింగిల్ టిక్కెట్ ని కూడా అవి తెగకుండా ఆపలేదు.. ఆ క్రేజ్ నే స్టార్ అంటాడనేశాడు ఆమిర్ ఖాన్… ఇంతకి ఈ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ సడన్ గా ఎన్టీఆర్ డైరెక్టర్లే కాదు, మ్యాన్ ఆఫ్ మాసెస్ అడుగులనే ఫోకస్ చేశాడు.. అంతవరకు బానే ఉంది కాని, తన ఫ్రెష్ స్టేట్మెంట్ ఉద్దేశ్యం ఏంటి? ఇప్పుడే ఎందుకా స్టేట్ మెంట్ ఇచ్చాడు..?
స్టార్ హీరో అంటేనే ఇంటికే పరిమితమైన జనాల్లో పూనకాలు తెప్పించి, థియేటర్స్ కి రప్పించాలి. ఆ విషయంలో ఈ ఏడాది కల్కీ , దేవర మూవీలతో ప్రభాస్, ఎన్టీఆరే జనాలను థియేటర్స్ కి బారులు తీరేలాచేశారు.. ఐతే ఇప్పుడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ మాత్రం స్టార్ అంటే డెఫినేషన్ క్లియర్ కట్ గా తేల్చాడు. పనిలోపనిగా ఎన్టీఆర్ పనితనాన్ని పరోక్షంగా మెచ్చుకున్నాడు.
ఆమిర్ ఖాన్ దంగల్ తర్వాత సింగిల్ సక్సెస్ లేదు. కాని జనాలను థియేటర్స్ కి క్యూ కట్టించే క్రేజ్ ఉన్న హీరో. కాని వరుసగా ఫ్లాపులు ఫేస్ చేస్తున్నాడు. అందుకే సాలిడ్ హిట్ కోసం సౌత్ దర్శకులని మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ డైరెక్టర్లనే టార్గెట్ చేశాడు
ఆల్రెడీ దేవర తీసిన కొరటాల శివతో ఓ చిన్న మీటింగ్ మొన్న సండేనే జరిగింది. ఇప్పుడు డ్రాగన్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఈ వారం మీటింగ్ జరగనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు గజినీ లాంటి సాలిడ్ మాస్ మూవీ చేసి కూడా, తనకి కూడా చాలా ఏళ్లైనట్టుంది. ఎందుకో కాని దేవర మూవీ తనని కుదిపేసినట్టుందనే ప్రచారం పెరిగింది
కారణం ఎంతో నెగెటివిటీ, భయంకరమైన ట్రోలింగ్స్ తట్టుకోవాటమే కాదు, రాజస్టాన్, లక్నౌ, భీహార్ లోకొన్ని థియేటర్్త మూత పడతాయనుకున్న చోట కూడా దేవర వసూళ్ల వర్షం కురిపించాడు. చాలా వరకు హిందీ హీరోలకు కూడా ఇది సాధ్యం కాలేదు. అందుకే దేవర మీద కేస్ స్టడి చేస్తున్నాడట ఈ దర్శక నిర్మాత కమ్ స్టార్ ఆమిర్ ఖాన్
అందుకే స్టార్ అంటే పదిరూపాయల సినిమాను వెయ్యిరూపాయలుగా మార్చే క్రేజీ మెటీరియల్ అన్నాడు. ఓ సినిమా లో స్టార్ ఉన్నాడంటే, తన క్రేజ్ తో జనాలు థియేటర్స్ కి క్యూ కట్టాల్సిందే అనేశాడు. ఒక మూవీలో స్టార్ ఉంటే, మొదటి రెండు మూడు రోజులు వసూళ్ల సునామీ వస్తుంది.. అదే రాకపోతే ఇక తనని స్టార్ అని ఎలా అంటామనేశాడు. కాని ఈరోజుల్లో అలా వసూళ్లు రాబట్టని వాళ్లు కూడా స్టార్ గా చలామని అవుతున్నారంటూ సెటైర్ వేశాడు. ఏదేమైనా దేవర సక్సెస్ ఆమిర్ ఖాన్ ని అట్రాక్ట్ చేసింది. సౌత్ దర్శకులు మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ తో సినిమాలు,తీసిన, తీస్తున్న డైరెక్టర్లతోనే కథా చర్చలు చేస్తున్నాడు… ఇలా బాలీవుడ్ కే పర్ఫెక్షనిస్ట్ అనిపించుకున్న స్టార్ పరోక్షంగా దేవర సక్సెస్ ని మెచ్చుకోవటం, స్టార్ డెఫినేషన్ తాలూకు స్టేట్ మెంట్ ఇవ్వటం నార్త్ లో హాట్ టాపిక్ అయ్యింది.