Ameesha Patelకోర్టులో లొంగిపోయిన అమీషా పటేల్.. అసలు కేసు ఏంటి ?
అమీషా పటేల్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. బద్రి, టక్కరిదొంగ, నాని, పరమవీరచక్ర.. బడా స్టార్లతో కలిసి మెరిసిందీ బ్యూటీ. ఐతే ఇప్పుడు సినిమాల కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్‌గా కనిపిస్తోంది.
గ్లామరస్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఐతే అమీషా ఇప్పుడు రాంచీ కోర్టు ముందు లొంగిపోయింది. దీంతో ఆమెకు ఏమైంది.. అసలు కేసు ఏంటి.. ఏ కేసులో కోర్టులో లొంగిపోవాల్సి వచ్చింది. నిజంగా అమీషా తప్పు చేసిందా అనే చర్చ జరుగుతోంది. చెక్‌బౌన్స్ కేసులో ఏప్రిల్ 6న రాంచీ సివిల్ కోర్టు.. అమీషా పటేల్‌కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
దీంతో ఆమె రాంచీ కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత తర్వాత అమీషా పటేల్‌కు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరుచేసింది కోర్టు. అజయ్ కుమార్ అనే నిర్మాత, బిజినెస్ మ్యాన్ దగ్గర నుంచి సినిమా నిర్మిస్తానని చెప్పి.. అమీషా పటేల్ రెండున్నర కోట్ల రూపాయల చెక్ తీసుకున్నారు. అయితే సినిమాను నిర్మించలేదు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీంతో అజయ్ కుమార్ రాంచీ సివిల్ కోర్టుని ఆశ్రయించారు.
వడ్డీతో కలిపి మూడు కోట్ల రూపాయలు చెల్లించాలని తన పిటిషన్‌లో తెలిపాడు. కేసులో అమీషా పటేల్ హాజరు కాకపోవటతోనే కోర్టు ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో అమీషా స్వయంగా లొంగిపోవడం.. ఆ తర్వాత వెంటనే బెయిల్ లభించడం చకచకా జరిగిపోయాయ్. 2000లో హృతిక్ రోషన్ మూవీ కహోనా ప్యార్ హై చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసింది అమీషా పటేల్. అదే ఏడాది ఆమె పవన్ కళ్యాణ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందిన బద్రి సినిమాలోనూ హీరోయిన్‌గా నటించింది. తమిళంలోనూ ఓ సినిమాలో నటించింది. అయితే సౌత్ కంటే అమీషా పటేల్ ఎక్కువగా నార్త్ సినిమాలపైనే ఫోకస్ చేసింది.