NTR31లో విలన్ గా అమితాబచ్చన్.. గూస్ బంప్స్ అప్డేట్..

దేవర తర్వాత తారక్ వార్ 2 లో నటించనున్నాడు. అంతేకాక కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నాడు. ఇప్పటికే ఈ కాంబోపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఎలాంటి కథతో రాబోతున్నాడు. ఎలా చూపించబోతున్నాడని నందమూరి ఫ్యాన్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఊరమాస్ గా ఉండటంతో.. ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తాజాగా బయటకు వచ్చిన ఓ మ్యాటర్ తో కాలర్ ఎగరేస్తున్నారు

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 1, 2023 | 04:11 PMLast Updated on: Dec 01, 2023 | 4:11 PM

Amitabh Bachchan As Villain In Ntr31 Goose Bumps Update

టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ “దేవర” తో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 5 2024న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు . ఎన్టీఆర్ కెరియర్ లోనే 31వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి .అంతేకాక ఈ సినిమా ద్వారా గ్లోబల్ స్థాయిలో ఆయన పేరు మరోసారి మారం మోగిపోవడం పక్కా అంటున్నారు నందమూరి ఫ్యాన్స్.

Animal : యానిమల్ వైలెన్స్ కి మైండ్ బ్లోయింగ్..

దేవర తర్వాత తారక్ వార్ 2 లో నటించనున్నాడు. అంతేకాక కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మూవీ చేయనున్నాడు. ఇప్పటికే ఈ కాంబోపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఎలాంటి కథతో రాబోతున్నాడు. ఎలా చూపించబోతున్నాడని నందమూరి ఫ్యాన్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఊరమాస్ గా ఉండటంతో.. ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తాజాగా బయటకు వచ్చిన ఓ మ్యాటర్ తో కాలర్ ఎగరేస్తున్నారు.

ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అమితాబచ్చన్ ను విలన్ గా చూస్ చేసుకున్నారట ప్రశాంత్ నీల్. సినిమాలో విలన్ అంటే ఎంత మాస్ లుక్ లో ఉంటారో అర్థం చేసుకోవచ్చు .అయితే అమితాబచ్చన్ లాంటి క్లాస్ హీరోని ఈ సినిమాల్లో మాస్ యాంగిల్ లో చూపిస్తే జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో అన్నది ప్రశ్నర్ధకంగా ఉంది . మరోపక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో బడా హీరో అయిన ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ బడా హీరో విలన్ గా నటిస్తూ ఉండడం అభిమానులకు ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. దీనితో ఈ సినిమాకి సంబంధించిన ఇదే న్యూస్ వైరల్ గా మారింది.