RAM CHARAN: రామ్ చరణ్ కోసం బాలీవుడ్ బిగ్ స్టార్..
ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన విషయం ఏంటంటే, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్. తనే ఇప్పుడు చరణ్ తాతగా కనిపించబోతున్నాడు. సూర్య నారాయణ ప్రతాప్ పాత్ర వేయబోతున్నాడు. బుచ్బి బాబు సన.. అమితాబ్‌కి ఇప్పటికే కథ చెప్పాడు.

RAM CHARAN: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో బుచ్చి బాబు సన ప్లాన్ చేసిన మూవీ జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈలోగా గేమ్ ఛేంజర్ పెండింగ్ షూటింగ్ పూర్తి చేస్తాడు చరణ్. అంతవరకు అంతా క్లియర్‌గానే ఉంది. ఇప్పుడు కొత్తగా యాడ్ అయిన విషయం ఏంటంటే, బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్. తనే ఇప్పుడు చరణ్ తాతగా కనిపించబోతున్నాడు. సూర్య నారాయణ ప్రతాప్ పాత్ర వేయబోతున్నాడు.
SS RAJAMOULI: రాజమౌళి టాక్స్ ఎగ్గొడుతున్నాడా..? లెక్కలు తేల్చారా..?
బుచ్బి బాబు సన.. అమితాబ్‌కి ఇప్పటికే కథ చెప్పాడు. అలాగే పాత్ర గురించి వివరించాడు. అయితే, అదే పాత్రని ఉంచుతారా? పాత్ర పేరు మార్చుతారా అనేది సినిమా మొదలై, పూర్తయ్యాక వస్తే కాని చెప్పలేం. కాకపోతే స్వాతంత్య్రం రాకముందు ఓ వెయిట్ లిఫ్టింగ్‌తో దేశానికి మెడల్ తెచ్చే ఓ స్పోర్ట్స్ పర్సన్‌గా రామ్ చరణ్ కనిపించబోతున్నాడు. శ్రీకాకుళానికి చెందిన కోడి రామమూర్తి రియల్ స్టోరీ ప్రేరణతోనే ఈ సినిమా తెరకెక్కబోతోందట. వర్కింగ్ టైటిల్‌గా పెద్ది అనుకున్నారు.
అయితే దంగల్‌తో తండ్రి తన లక్ష్యాన్ని కూతుళ్ల ద్వారా సాధించినట్టు, ఓ తాత తన డ్రీమ్‌ని మనవడి ద్వారా సాధించటమే ఈ చిత్ర కథ అని తెలుస్తోంది. ఇక సైరాలో చిరు గురువుగా కనిపించిన అమితాబ్ బచ్చన్, ఇలా ఈ మూవీలో చరణ్ తాతగా కనిపించటం దాదాపు ఖాయం.