Amitabh Bachchan: ప్రభాస్ పిల్లాడేనా.. అమితాబ్ బచ్చన్ సరికొత్త రికార్డు..

తాజాగా అమితాబ్ పాత్రని పరిచయం చేస్తూ ఒక వీడియో విడుదల చేసారు. నిమిషం నిడివి ఉన్నఆ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో, ట్రెండింగ్‌లో ఉంది. కేవలం 16 గంటల్లోనే 44 లక్షల వ్యూస్‌తో ముందుకు దూసుకుపోతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 22, 2024 | 06:14 PMLast Updated on: Apr 22, 2024 | 6:14 PM

Amitabh Bachchans Glimpse From Kalki 2898 Ad Creating Record Views

Amitabh Bachchan: పదహారు గంటలు.. కేవలం పదహారంటే పదహారు గంటల్లో ఒక సరికొత్త రికార్డు నమోదు అయ్యింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అదొక అరుదైన రికార్డు. ఎనిమిది పదుల వయసులో ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సాధించిన ఆ రికార్డు ఇప్పుడు టాక్ ఆఫ్ ది డేగా నిలిచింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ట్ మూవీ కల్కి 2898 ఏడి. ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు పాన్ ఇండియా మొత్తం ఈ మూవీ కోసం ఎదురుచూస్తుంది.

KALKI 2898 AD: కల్కి అమితాబ్‌ యంగ్‌ లుక్‌పై రచ్చ.. కొరటాల తప్పే నాగి చేస్తున్నాడా ?

మే 9న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీలో అమితాబ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఆయన గెటప్‌ని రిలీజ్ చేస్తే అది సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ సాధించింది. తాజాగా అమితాబ్ పాత్రని పరిచయం చేస్తూ ఒక వీడియో విడుదల చేసారు. నిమిషం నిడివి ఉన్నఆ వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో నెంబర్ వన్ స్థానంలో, ట్రెండింగ్‌లో ఉంది. కేవలం 16 గంటల్లోనే 44 లక్షల వ్యూస్‌తో ముందుకు దూసుకుపోతుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద అమితాబ్‌కి ఇప్పటికీ ఉన్న చరిష్మా ఏపాటిదో అర్ధం అవుతుంది. మహాభారతకాల సమయంలో పాండవులకు విద్య నేర్పిన ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామగా అమితాబ్ ఈ సినిమాలో కనిపిస్తారు. దీన్నిబట్టి మూవీ స్థాయిని ఊహించుకోవచ్చు. మేకర్స్ విడుదల చేసిన వీడియోలో ఒక చిన్న పిల్లవాడు అమితాబ్‌ని నువ్వు ఎవరు అని అడుగుతుంటాడు.

దీంతో కొంత మంది ఆ పిల్లాడు ప్రభాస్ అయ్యుంటాడేమో అనుకుంటున్నారు. అలాగే ప్రభాస్ క్యారక్టర్‌కి, అశ్వద్ధామకి సంబంధం ఏంటి అనే క్యూరియాసిటీ కూడా అందరిలో ఏర్పడింది. ఆసలు అమితాబ్ ఇంట్రడక్షన్ క్యారక్టరే ఒక రేంజ్‌లో ఉంటే ఇక ప్రభాస్ క్యారక్టర్ ఎలా ఉంటుందో అని కూడా ఫ్యాన్స్ ఉహించుకుంటున్నారు. లోకనాయకుడు కమల్ హాసన్ క్యారక్టర్ మీద కూడా అందరిలో క్యూరియాసిటీ ఉంది. దీపికా పదుకొనే హీరోయిన్‌గా చేస్తుండగా, వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు.