Amithabh Bachchan: తన జీవితంలోని ఓ హాస్య సంఘటనను ఇన్ స్టాలో పోస్టింగ్..!
అమితాబ్ బచ్చన్ ఈ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చే మరో పేరు బిగ్ బి. ఈయన సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొన్ని దశాబ్దాలు గడిచింది. ముందు ఈయనను అవకాశాలు ఇవ్వకుండా అవమానించిన వారే నేడు ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురుచూసేంతగా ఎదిగారు. ఇంతటి స్టార్ డమ్ ఒక్క ఓవర్ నైట్లో రాలేదు. కొన్నేళ్ల కృషి ఉంది. అప్పుడప్పుడూ మన సినిమా హీరోలు సందర్భానుగుణంగా ఏదో ఒకరకంగా ట్వీట్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బిబ్ బీ కూడా ఒక పోస్ట్ చేశారు.
1980లో ఫిబ్రవరిలో విడుదలైన చిత్రం దో ఔర్ దో పాంచ్. ఈ చిత్రాన్ని రాకేశ్ కుమార్ దర్శకత్వ వహించారు. సాండో ఎంఎంఏ చిన్నప్ప తేవర్ నిర్మించారు. ఇందులో హేమమాలిని, ఖదీర్ ఖాన్, ఓం ప్రకాశ్, శ్రీరామ్ లగూ వంటి అగ్రతారలు ప్రదాన పాత్రపోషించారు. ఈ చిత్రం 43ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆ సినిమా చిత్రీకరణ సమయంలో అమితాబ్ ఎదుర్కొన్న ఒక మధురమైన జ్ఞాపకాన్ని అభిమానులతో ఇన్ స్టా గ్రామ్ వేదికగా పంచుకున్నారు.
అప్పట్లో సినిమాలో నటించిన కాస్ట్యూమ్ కి సంబంధించిన ఫోటోను పోస్ట్ చేస్తూ నవ్వులు పూయిస్తున్న ఎమోజీలను జతపరిచారు. ఆ హాస్యపూరితమైన సంఘటన గురించి ఇలా చెప్పుకొచ్చారు. అప్పట్లో బెల్ బాటమ్స్ ప్యాంట్స్ చాలా ఫేమస్. వీటిని బాలీవుడ్ లోనే కాకుండా మన టాలీవుడ్ అగ్ర కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు కూడా ధరించేవారు. దీనిని క్రమక్రమంగా బూట్ కట్ ప్యాంట్లుగా కూడా పిలిచేవారు. వీటిని మనందరం ఏదో ఒక సందర్భంలో ధరించి ఉంటాము. వీటికి క్రిందిభాగంలోని పాదాల వద్ద చాలా వెడల్పుగా ఉంటుంది. చాలా కాళీస్ధలం ఉంటుంది. “నేను ఒకరోజు ఈ ప్యాంటు వేసుకొని సినిమా చూసేందుకు థియేటర్ కు వెళ్లాను. కుర్చీలో కూర్చొని సినిమా చూసే సమయంలో ఒక ఎలుక నాప్యాంటులో దూరిందని చెప్పారు. ఆ హాస్యపూరితమైన భావనను ఎప్పుడూ మరువలేనని ఆక్షణాలను గుర్తుచేశారు”.
View this post on Instagram