Bala krishna : ఎన్‌బీకే 109 ఎక్జయిటింగ్ అప్‌డేట్
టాలీవుడ్ (Tollywood) సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) జెట్ స్పీడ్ మీదున్నాడు.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. గతేడాది వీరసింహారెడ్డి (Veerasimha Reddy), భగవంత్ కేసరి (Bhagwant Kesari) సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు.

Among Tollywood's senior heroes, Nandamuri Balakrishna is on jet speed.
టాలీవుడ్ (Tollywood) సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) జెట్ స్పీడ్ మీదున్నాడు.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.. గతేడాది వీరసింహారెడ్డి (Veerasimha Reddy), భగవంత్ కేసరి (Bhagwant Kesari) సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు..ఈ సినిమాలు ఇచ్చిన జోష్‌తో మరో బ్లక్ బస్టర్ కాంబోను లైన్‌లో పెట్టాడు. బాలయ్య రీసెంట్‌గా నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ NBK 109. వాల్తేరు వీరయ్యతో గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఊర్వశి రౌటేలా అలాగే బాబీ డియోల్ ల కలయికలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి..
‘‘సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫూట్.. ఇట్స్ కాల్డ్ హంటింగ్’’ అంటూ బాలయ్య తన స్టైల్‌లో చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిచింది.. ఇక ఈ సినిమా నుంచి నెక్స్ట్ ట్రీట్ పై ఇప్పుడు లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది.. ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేస్తూ మరో యాక్షన్ టీజర్ ని మేకర్స్ ఈ జూన్ 10న బాలయ్య పుట్టినరోజు కానుకగా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది..ఈ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
ఇక ఈ విషయం తెలుసుకున్న నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా దీనిపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవరనాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. కాగా.. ఈ ఏడాదిలో మూవీ రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు.