Pawan Kalyan : పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో (Pawan Kalyan) గా నిధి అగర్వాల్ (Nidhi Aggarwal) హీరోయిన్ గా బాలీవుడ్ (Bollywood) స్టార్ నటుడు బాబీ డియో ల్ తదితర నటులు నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు.. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

An exciting news for Pawan fans
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో (Pawan Kalyan) గా నిధి అగర్వాల్ (Nidhi Aggarwal) హీరోయిన్ గా బాలీవుడ్ (Bollywood) స్టార్ నటుడు బాబీ డియో ల్ తదితర నటులు నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు.. విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ బిగ్గెస్ట్ చిత్రం ఎన్నో ఏళ్ల నుంచి అలా ఆలస్యం అవుతూ వస్తుంది. ఈ సినిమా అప్‌డేట్స్ గురించి పవన్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఈ టైమ్‌లో ఫ్యాన్స్ ఎదురు చూపులకు చెక్ పెడుతూ ఓ న్యూస్ వైరల్ అవుతోంది.. లే.
లేటెస్ట్ టాక్ ప్రకారం వీరమల్లు జాతర ఈ మహా శివరాత్రి (Maha Shivaratri) కానుకగా రాబోతోందట.. మార్చి 8న శివరాత్రి రోజుల హరిహర వీరమల్లు ట్రీట్ రాబోతోందన్న న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. దీంతో.. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. అయితే.. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. నిర్మాత ఎఎం రత్నం.. పవన్ కెరీర్‌లో స్పెషల్ మూవీగా నిలిచిపోయే విధంగా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
పిరియాడిక్ జోనర్‌లో రాబోతున్న ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలైంది. కానీ, అనివార్య కారణాల వల్ల షూటింగ్‌కు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. కాగా.. ఈ క్రేజీ మూవీని మొగల్ చక్రవర్తుల కాలం నాటి కథతో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. కాగా.. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు (Oscar Award) విజేత ఎంఎం కీరవాణి (MM Keeravani) మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనుందని భావిస్తున్నారు.