Kartika Deep 2 : కార్తీక దీపం2”కు అదిరిపోయే రెస్పాన్స్

ఈ మ‌ధ్య కాలంలో సినిమాల‌కు, సీరియ‌ల్స్‌కు మ‌ధ్య పోటీ ఎక్కువైంది. కుటుంబ ప్రేక్ష‌కులు, ముఖ్యంగా ఆడ‌వాళ్లు సీరియ‌ల్స్‌కి అంకితం అయిపోయారు. దీంతో.. ఈ రెండిటికీ మ‌ధ్య స‌వ‌తి పోరు ఎక్కువైపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 5, 2024 | 12:30 PMLast Updated on: Apr 05, 2024 | 12:30 PM

An Overwhelming Response To Kartika Deepam 2

ఈ మ‌ధ్య కాలంలో సినిమాల‌కు, సీరియ‌ల్స్‌కు మ‌ధ్య పోటీ ఎక్కువైంది. కుటుంబ ప్రేక్ష‌కులు, ముఖ్యంగా ఆడ‌వాళ్లు సీరియ‌ల్స్‌కి అంకితం అయిపోయారు. దీంతో.. ఈ రెండిటికీ మ‌ధ్య స‌వ‌తి పోరు ఎక్కువైపోయింది. ఇక సినిమాల్లో హీరో హీరోయిన్ల‌లాగానే సీరియ‌ల్లో క్యారెక్ట‌ర్లు కూడా సొసైటీపై బాగా ప్ర‌భావం చూపిస్తున్నాయి. ఈ ప‌రంప‌ర‌లో ‘కార్తీక దీపం’ సీరియ‌ల్స్ (Serials) మొద‌టి స్థానంలో ఉంటుంది. ఈ సీరియ‌ల్ సాధించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. వంట‌లక్క‌, డాక్ట‌ర్ బాబు పాత్ర‌లు ప్ర‌తీ ఇంటిలోనూ మార్మోగిపోయాయి. ఈ సీరియ‌ల్ అయిపోయినప్పుడు బాధ‌ప‌డ‌ని వారంటూ ఎవ‌రూ లేరంటే అతిశ‌యోక్తి కాదేమో.. ఇక‌.. ఈ సీరియ‌ల్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా దీనికి ప్రీమియ‌ర్లు కూడా వేశారంటే.. ఓ సినిమా రేంజ్‌లో కార్తీక దీపం సీరియ‌ల్ ప్రేక్ష‌కుల‌పై ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవ‌చ్చు.. ఆ ర‌కంగా ‘కార్తీక దీపం’ రికార్డు సృష్టించింద‌నే అనుకోవాలి.

ప్రేక్ష‌కుల్లో ఇంత క్రేజ్ ఉంది కాబ‌ట్టే.. ఎన్నో ఏళ్లుగా ఒక్క ఆడవారినే కాదు.. మగవారిని సైతం టీవీల ముందు కూర్చొబెట్టింది కార్తీక దీపం (Kartika Deep).. అలాంటి సీరియల్ కు ఇప్పుడు సీక్వెల్ వ‌చ్చేసింది. ఈ సీరియల్ అప్పుడే అయిపోయింది అని అనుకున్న వారికి గుడ్ న్యూస్ చెబుతూ, ప్రముఖ టీవీ ఛానల్ స్టార్ మా కార్తీక దీపం 2 (Kartika Deep 2) ను స్టార్ట్ చేసింది. ప్రేమి వినీత్ భట్ దీప పాత్రలో నటించగా, నిరుపమ్ పరిటాల డాక్టర్ కార్తిక్ పాత్రలో నటించారు.

అయితే.. ఈ సీరియల్ కి బుల్లితెర ప్రేక్షకుల నుండి అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సీరియల్ మొదటి వారం స్టార్ మా లో ప్రసారం కాగా, సూపర్ టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది.ఈ సీరియల్ మొదటి వారం కు గానూ 10.40 టీఆర్పీ రేటింగ్ ను రాబ‌ట్టి షాకిచ్చింది.. ఫ‌స్ట్ వీక్‌లోనే ఈ రేంజ్ రేటింగ్ వ‌చ్చిందంటే.. ఈ సీరియల్ మున్ముందు మరింత క్రేజ్ ను సొంతం చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. చూడాలి మ‌రి.. కార్తీక దీపం-2 సీరియ‌ల్ మున్ముందు ఇంకెన్ని రికార్డుల‌ను సొంతం చేసుకోనుందో..