Baby Movie: వాడుకోవడం, వదిలేయడం.. అమ్మాయిలంతా ఇంతేనా.. బేబీ మూవీ చుట్టూ కొత్త వివాదం..
చిన్న సినిమాగా వచ్చినా.. పెద్ద సక్సెస్ అందుకుంది బేబీ మూవీ. బాయ్‌ఫ్రెండ్‌కు, ఫ్రెండ్ అయిన బాయ్‌కు మధ్య ఎంత దూరం ఉంచాలో.. ఆ దూరం చెరిగిపోతే జీవితాలు ఎలా నలిగిపోతాయో డైరెక్టర్ బాగా చూపించాడు.
యూత్‌ను టార్గెట్ చేసుకునే డైరెక్టర్ పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. యువత అంతా ఇప్పుడీ మూవీకి బాగా కనెక్ట్ అయింది. కమిటెడ్, బ్రోకెన్.. సింగిల్స్.. ఇలా ముగ్గురి చుట్టూ సోషల్ మీడియాలో పేలుతున్న మీమ్స్ అన్నీ ఇన్నీ కావు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఓపెన్ చేస్తే బేబీ మూవీ మీమ్స్, ట్రోల్స్ మాత్రమే కనిపిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు.. యూత్‌కు ఎంతలా కనెక్ట్ అయింది మూవీ అని ! కొత్త ట్రెండ్ అనలేం కానీ.. ప్రేమకథలను కొత్తగా చూపించిన మూవీగా నిలిచింది బేబీ. ఓ చిన్న రాంగ్ స్టెప్.. ఓ యువతిని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టేస్తుందని పక్కాగా చూపించారు. రిలీజ్ అయి మూడు రోజులు గడుస్తున్నా.. ఇంకా హౌస్‌ఫుల్ కలెక్షన్లు కనిపిస్తున్నాయ్. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ.. బేబీ సినిమా మీద ఓ వర్గం పెదవి విరుస్తోంది.
అబ్బాయిలను ఆడుకొని, వాడుకొని వదిలేసే రకంగా అమ్మాయిలను చూపించారు అంటూ వాళ్లంతా ఫైర్ అవుతున్నారు. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చిన సీన్ల మీద మరింత రచ్చ జరుగుతోంది. ప్రేమించేందుకు ఒకడు.. వాడుకునేందుకు ఒకడు కావాలా అంటూ.. మూవీలో ఆ పాత్ర చెప్పే డైలాగ్ చుట్టూ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయ్. అమ్మాయిలంతా బాయ్‌ఫ్రెండ్ గేమ్ ఆడుతారు అన్నట్లు ఆ మాటలు వినిపిస్తున్నాయని.. ఒక్క పాత్ర కోసం అందరినీ కట్టిపడేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొందరు మండిపడుతున్నారు. సినిమాల్లో అభ్యంతర సన్నివేశాలు, డైలాగులు చాలానే ఉన్నాయ్.
ఐతే హీరోకు అంత ఫేమ్ లేకపోవడం, హీరోయిన్ పెద్దగా ఎవరికీ తెలియకపోవడంతో.. అవన్నీ బయటకు రావడం లేదు. పెద్ద హీరో అయితే ఆ డైలాగ్‌లకు, సీన్లకు ఇప్పటికే రచ్చ అయ్యేదని బేబీ మూవీ చూసిన వాళ్లలో మరికొందరి అభిప్రాయం. ఐతే ఇప్పుడు సినిమా హిట్ అయింది. రీచ్ మరింత పెరుగుతోంది. హీరోయిన్ పాత్రను డీగ్రేడ్ చూపిస్తూ తీసిన ఈ మూవీపై.. మహిళా సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయ్.. మనోభావాల బ్యాచ్ స్పందన ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది.