Anchor Anasuya: అనసూయకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ..
ఇంటర్నెట్‌లో అనసూయ వర్సెస్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వార్ కంటిన్యూ అవుతోంది. అనసూయ చేసిన ఒక్క ట్వీట్‌తో మొదలైన ఈ దుమారం ఇప్పుడు రచ్చ లేపుతోంది. రీసెంట్‌గా విజయ్ దేవరకొండ చేసిన ఖుషీ సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ మీద విజయ్ పేరును ది విజయ్ దేవరకొండ అని రాశారు. ఈ పేరు మీద అనసూయ ఇండైరెక్ట్‌గా రియాక్ట్ ఐంది. "ది" న ఇదేం పైత్యం అంటూ పోస్ట్ చేసింది.

Anasuya Vs Anandh Devarakonda
దీనిపై విజయ్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. ఆంటీ అని సోషల్ మీడియాలో మళ్లీ ఏడిపించేశారు. ఇదంతా నీకు అవసరమా..? నీ పనేదో నువ్ చూసుకుంటే బెటర్ అంటూ మరికొందరు ఫైర్ అయ్యారు. షోలు లేవ్.. సినిమాలు లేవ్.. దీంతో తన గురించి ఎవరూ మాట్లాడుకోవడం లేదని.. కావాలని అనసూయ ఓవరాక్షన్ చేస్తోందని.. పడిపోయిన క్రేజ్‌ను, గ్రాఫ్‌ను మళ్లీ పెంచుకోవడానికే.. ఇంత పెంట చేస్తోందని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. చిలికి చిలికి గాలివానగా మారిన ఈ దుమారం దాదాపు పోలీస్ కంప్లైంట్ వరకూ వెళ్లి ఆగిపోయింది.
ఇప్పుడు మరోసారి అనసూయకు కౌంటర్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ. ఆనంద్ హీరోగా చేసిన బేబీ సినిమా నుంచి థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేసింది మూవీ టీం. ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. పోస్ట్‌లో ప్రతీ ఒక్కరి పేరు ముందు “THE”ని యాడ్ చేశారు. ఆనంద్ పేరు ముందే కాకుండా రిలీజ్ చేసిన సాంగ్ ముందు ఆఖరికి సినిమా పేరు ముందు కూడా “ది”ని యాడ్ చేశారు. దీంతో అనసూయ వర్సెస్ దేవరకొండ బ్రదర్స్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి విజయ్ దేవరకొండను అనసూయ టార్గెట్ చేయడానికి కారణం అర్జున్ రెడ్డిలో అన్న బూతు పదం మాత్రమే అని అంతా అనుకున్నారు.
కానీ మీకు మాత్రమే చెబుతా సినిమాలో అనసూయకి ఎక్కువ సీన్లు పెట్టి, తర్వాత ఎడిటింగ్ లో చాల వరకు తీసేశారని , అప్పటి నుంచి ఆ మూవీ నిర్మాత అయిన విజయ్‌తో తనకి గొడవలున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే కాదు అసలు గొడవకి మరోకారణం, అనసూయతో భర్త భరద్వాజ ఓసారి గొడవకు దిగాడట. ఏదో పార్టీలో లైగర్ ప్లాప్ గురించి నోరు జారిన భరద్వాజని.. భార్య సంపాదనతో బతికే వ్యక్తంటూ విజయ్ కూడా ఫైర్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది మనసులో పెట్టుకునే విజయ్ ఫ్యాన్స్ మండిపడతారని తెలిసి కూడా అనసూయ ఇలా రియాక్ట్ అవుతోందనంటున్నారు. ఇక ఫ్యాన్స్ అయితే ఇదే మరో హీరో అయితే అనసూయ ఇలా ట్వీట్లు చేసేదా? బ్యాగ్రౌండ్ లేకుండా ఎదుగుతున్న స్టార్ కాబట్టే ఈజీ టార్గెట్ అనుకుంటోంది.. కాని రౌడీకి తామున్నామంటున్నారు ఫ్యాన్స్. అయితే బీబీ మూవీ టీం ఇప్పుడు చేసిన పనికి అనసూయ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.