Anant Ambani Second Pre Wedding : అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ సెకండ్ ప్రీ-వెడ్డింగ్ ఖర్చు ఎంతో తెల్సా..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) రెండో కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) వివాహం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Anant Ambani-Radhika Merchant Second Pre-Wedding Expenditure Revealed
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ (Mukesh Ambani) రెండో కుమారుడు అనంత్ అంబానీ (Anant Ambani) వివాహం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆసియా కుబేరుడిగా కీర్తి దక్కించుకున్న ముకేశ్ తన చిన్న కొడుకు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను ఘనంగా జరుపుతున్నారు. మార్చి 1 నుంచి లో మూడు రోజుల పాటు జరిగిన వేడుకలు అంగరంగ వైభవంగా జామ్ నగర్ లో చేశారు. అయితే ఈ వేడుకలకు అయిన ఖర్చు చూసి అంతా షాకైపోతున్నారు. దాదాపు 1000 కోట్ల కు పైగా ఖర్చు చేసిన అంబానీ ఫ్యామిలీ… సెకండ్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను అంతే గ్రాండ్ గా చేసి హాట్ టాపిక్ గా మారారు.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల సెకండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల సముద్రం మధ్యలో జరిగిన ఈ వేడుకలకు లగ్జరీ క్రూజ్ షిప్ వేదికైంది. ఇటలీ (Italy) లోని పోర్టోఫినోలో జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ (Pre-Wedding) వేడుక ముగిశాయి. రెండోసారి నిర్వహించిన ఈ వేడుకలకు బాలీవుడ్ తారలతో పాటు వివిధ రంగాలకు ,చెందిన 800 వందలకు పైగా ప్రముఖులు హాజరయ్యారు. నాలుగు రోజులు పాటు వేడుకలు నెవర్ బిఫోర్ అనేలా సాగాయి. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన వేడుకల్లో ఇది ఒకటని అంతా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. వచ్చిన అతిధులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వీరు ఈ వేడకల్ని చాలా జాగ్రత్తగా నిర్వహించారని అంటున్నారు. ఈ వేడుకల కోసం దాదాపు 7 వేల 500 వందల కోట్లు ఖర్చు చేశారట.
ఇక అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పెళ్లి తేదీని కూడా పూజారులు ఇటీవల ప్రకటించారు. జూలై 12న ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్ లో వీరి వివాహం జరగనుంది. జులై 14న రిసెప్షన్ జరగనుంది. అదే సమయంలో పెళ్లి వేడుకకు ముందుగా భారీ ఎత్తున ప్రీ వెడ్డింగ్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు . ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖులు ఈ పార్టీకి ఆహ్వానించారు. ఏదేమైనా మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. కానీ.. బిగ్ మేరేజెస్ ఆర్ మేడ్ ఇన్ అంబానీస్ కాంపౌండ్ అన్నట్లు గా ఉండబోతుంది పెళ్లి వేడుక. రెండు సార్లు జరిగిన ఈ ప్రీవెడ్డింగ్ సెషన్ కోసం కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్న అంబానీ ఫ్యామిలీ పెళ్లికి ఎంత ఖర్చు చేస్తారోనని డిస్కషన్ మొదలైంది.